బాలయ్య,అనిల్ రావిపూడి స్టోరీ లైన్ అదుర్స్..!!

-

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తాను గోపిచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్న సినిమా వీరసింహారెడ్డి లో నటిస్తున్నారు.ఇక ఇందులో  యాక్షన్ సన్నివేశాలు ఫైట్స్ కోసం చాలా కష్టపడుతున్నారు.ఇందులో ఫైట్స్ లో బాలయ్య అఖండ ను మించిన ఎనర్జీ తో చేశారని అంటున్నారు.ఇక నెక్స్ట్ సినిమా అనిల్ రావిపూడి తో చేస్తున్న సంగతి తెలిసిందే.

దాని కోసం అనిల్ రావిపూడి ఎంతో కష్టపడి స్క్రిప్ట్ రెడీ చేసారట. ఇక ఇందులో హీరోయిన్ గా సోనాక్షి సిన్హా ను , మరో ముఖ్య పాత్ర కోసం శ్రీ లీల ను ఎంచుకున్నారట. అయితే, బాలయ్య కోసం తాను తన జోనర్ అయిన కామిడీ పూర్తిగా వదిలి పెట్టకుండా, ఓ భారీ యాక్షన్ కామెడీ సబ్జెక్ట్  కలిపి రాసినట్లు అనిల్ రావిపూడి ఆ మధ్య ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. కాగా ఈ సినిమా కథలో మెయిన్ పాయింట్ గురించి తెలిసింది.

వయస్సు లో ఉన్నప్పుడు బాలయ్య మంచి పవర్ ఫుల్ రోల్ లో కనిపిస్తాడట. ఈ ఆవేశం కారణంగా జరిగే గొడవల్లో తాను భార్య ను పోగొట్టుకొని జైల్ కు వెలతాడట.ఇక జైలు నుంచి ఏభై ఏళ్ల వయసులో విడుదలైన హీరో మళ్లీ చిన్నప్పుడు వదిలి వెళ్ళిన కూతురును కలుసుకుంటాడు. అప్పటికే అతని శత్రువులు ఆమె పై దాడి చేస్తూ ఉంటే తన కూతురు ను ఎలా కాపాడు కుంటాడు అనేది మిగిలిన కథగా ఉంటుందని అంటున్నారు. దీనిలో బాలయ్య బాబు తగ్గట్టుగా మాస్ డైలాగ్స్ పేలిపోతాయని తెలుస్తోంది

Read more RELATED
Recommended to you

Exit mobile version