ఎన్టీఆర్ గురించి ఎంత చెప్పినా తక్కువే : బాలకృష్ణ

-

ఎన్టీఆర్ గురించి ఎంత చెప్పినా తక్కువేనని నందమూరి బాలకృష్ణ తెలిపారు. రామారావు అంటే నటనకు ప్రతిరూపం, నవరసాలకు ఒక అర్థం, ఒక గ్రంథాలయం, నవ శకానికి ఆరంభం, ఒక జాతికి ఆదర్శం, అగ్నికణం అని ఆయన కొనియాడారు. తెలుగు ప్రజల్లో శాశ్వతంగా నిలిచిపోయిన మహనీయుడని చెప్పారు. ఎవరికీ దక్కని మహత్తర జన్మను నందమూరి తారకరామారావు పొందారని తెలిపారు. సినిమాల్లోనూ, రాజకీయాల్లోనూ ప్రయోగాలు చేశారని బాలయ్య తెలిపారు. రాష్ట్రం మొత్త వినాశనం అయిపోయిందని నందమూరి బాలకృష్ణ అన్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిపాలన చేసిందేమీ లేదని విమర్శించారు. ఇప్పుడున్న పరిపాలకుడు ‘లక్షల కోట్ల భక్షకుడు, పక్షపాత రూపకుడు, అవినీతి అర్భకుడు, కుంభకోణాల కీచకుడు, మూర్ఖూడు, జగమేరిగిన జగన్నాటకుడు, దేశానికి పట్టిన దరిద్రం.

రాష్ట్రానికి పట్టిన రావణాసురుడు’ అని విమర్శించారు. మొదటి మూడేళ్ల పాలనలో మూడు రాజధానుల పేరుతో కాలాన్ని వెల్లబుచ్చాడని ఎద్దేవా చేశారు. నవరత్నాల కోసం సీఎం జగన్ రూ.8 లక్షల కోట్లు అప్పు చేశారని బాలకృష్ణ తెలిపారు. ఆ డబ్బంతా ఏమైందని.. అందరికీ అందుతున్నాయా? ఆయన ప్రశ్నించారు. తాను అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే పోలవరం పూర్తి చేస్తానని హామీ ఇచ్చి ఇప్పటి వరకూ పూర్తి చేయలేక పోయారని విమర్శించారు. జగన్ రాష్ట్రానికి పట్టిన ఖర్మ అని, ప్రజలకిచ్చేది రూ.10 అని.. లాక్కునేది రూ.100 అని బాలకృష్ణ మండిపడ్డారు. ‘పరిశ్రమలు వెళ్లిపోతున్నాయి. నిరుద్యోగం పెరిపోయింది. గంజాయి పెంచడంలో రాష్ట్రం నెం1లో ఉంది.’ అని బాలకృష్ణ విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version