నందమూరి బాలయ్య బాబు నటించిన చివరి మూడు సినిమాలు టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర దారుణంగా ఫ్లాప్ కావడంతో నందమూరి అభిమానులు బాలయ్య తీరుపై ఆయన సెలెక్ట్ చేసుకుంటున్నా సినిమా స్టోరీ లపై సోషల్ మీడియాలో నందమూరి ఫ్యాన్స్ బహిరంగంగానే కామెంట్ చేస్తున్నారు. నటనలో కొత్తదనం ఉండాలని కోరుకుంటున్న అభిమానుల కోరిక మేరకు బాలయ్య బాబు ప్రస్తుతం బోయపాటి తో చేయబోతున్న సినిమా విషయంలో కండిషన్ పెట్టినట్లు ఆ విషయంలో చాలా కఠినంగా వ్యవహరించినట్లు బోయపాటికి తేల్చి చెప్పినట్లు ఇండస్ట్రీలో వినబడుతున్న టాక్.
మేటర్ ఏమిటంటే వినయ విధేయ రామ సినిమాని డైరెక్టర్ బోయపాటి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో తెరకెక్కించడం జరిగింది. దీంతో బాలయ్య బాబు డైరెక్టర్ బోయపాటి కి తన టీం మార్చాలని చెప్పటంతో గత కొంత కాలం చాలా మందిని మార్చిన బోయపాటి సినిమాటోగ్రాఫర్ రాంప్రసాద్‌ను కూడా బోయపాటి తప్పించినట్లు ఇండస్ట్రీలో వార్తలు వినబడుతున్నాయి.
ఆ స్థానంలో బాలయ్య సినిమా కోసం డైరెక్టర్ బోయపాటి వేరొక సినిమాటోగ్రఫర్‌ను ఎంపిక చేస్తున్నట్లు దాని కోసం ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు సమాచారం. కాగా సింహా, లెజెండ్ లాంటి రెండు సినిమాలు బోయపాటి దర్శకత్వంలో సూపర్ డూపర్ హిట్ కావడంతో రాబోతున్న మూడవ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు నందమూరి అభిమానులు.