తెలంగాణ అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రేషన్ బియ్యంతో ఒక మాఫియా నడిపిస్తున్నారు. కేబినెట్ నిర్ణయం మేరకు రేషన్ కార్డు ఉన్న వారికి సన్న బియ్యం ఇవ్వబోతున్నామని తెలిపారు. ఉగాది రోజు సన్నబియ్యం పథకం ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడలేని విధంగా రేషన్ కార్డు హోల్డర్లకు 6 కిలోల సన్న బియ్యం ఫ్రీ గా అందజేస్తాం. సన్న బియ్యం పై సభ్యులు ఏమైనా సలహాలు, సూచనలు చేస్తే తీసుకుంటాం. ఏప్రిల్ మాసంలో కొత్త రేషన్ బియ్యం వస్తుంది. ఈ పథకంతో 84 శాతం మంది పేద ప్రజలకు లబ్ధి చేకూరుతుంది.
సన్న బియ్యంతో పాటు నిత్యవసర వస్తువులు కూడా త్వరలో ఇస్తామని మంత్రి ఉత్తమ్ చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వం చేసిన అప్పులు ప్రస్తుత ఇరిగేషన్ బడ్జెట్ లో పెట్టామని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు. ప్రాజెక్టుల పేరిట అప్పులు తీసుకున్నారు. కానీ ప్రాజెక్టుల పేరిట అప్పులు తీసుకున్నారు కానీ ప్రాజెక్టులు పూర్తి చేయలేదు. ఆయకట్టు పెరగలేదన్నారు. ప్రాజెక్టుల విషయంలో ఎలాంటి వివక్ష ఉండదని తేల్చి చెప్పారు.