ఏపీ రాజకీయాల్లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి.వైఎస్ అవినాశ్ రెడ్డి వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ పవన్‌కు పోలీసులు తాజాగా నోటీసులు ఇచ్చారు. నేడు విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు పంపించారు.
సునీల్ యాదవ్ అనే వ్యక్తి ఫిర్యాదుతో పవన్‌కు పులివెందుల పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలోనే గ్రూప్ అడ్మిన్ పవన్‌ను పులివెందుల డీఎస్పీ మురళీనాయక్ విచారించనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ప్రతిపక్ష వైసీపీ పార్టీకి చెందిన కొందరు సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సునీల్ యాదవ్ ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపడుతున్నట్లు సమాచారం.