జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన ముగిసింది. ఆదివారం మధ్యాహ్నం ఢిల్లీ వెళ్ళిన పవన్ కళ్యాణ్ పలువురు కీలక నేతలతో భేటి అయినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా బిజెపి అగ్రనేతలను కలవడానికి వెళ్ళిన ఆయన, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నేతలతో కలిసి చర్చలు జరిపినట్టు సమాచారం. సురేష్ భయ్యా జోషీని కలిసిన పవన్ కళ్యాణ్ ఆయనతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి,
రాష్ట్రంలో ఉన్న పరిస్థితులపై ఆయనతో చర్చించినట్టు తెలుస్తుంది. ఇక తాజాగా ఆయన బిజెపి వర్కింగ్ ప్రెసిడెంట్ జెపి నడ్డాని కలిసి పార్టీ విలీనంపై చర్చలు జరిపినట్టు సమాచారం. లేదా భవిష్యత్తు ఎన్నికల్లో బిజెపి జనసేన కలిసి పోటీ చేసే విధంగా చర్చలు జరిపినట్టు తెలుస్తుంది. నడ్డాని కలవడానికి సోమవారం ఎదురు చూసిన పవన్, ఆయన్ను కలిసి పార్టీ పరిస్థితి, రాష్ట్ర పరిస్థితిని వివరించినట్టు సమాచారం.
భవిష్యత్తు ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి ముందుకి వెళ్ళడానికి నడ్డా అంగీకారం తెలిపినట్టు తెలుస్తుంది. పవన్ కూడా బిజెపి ప్రతిపాదనకు అంగీకారం తెలిపినట్టు వార్తలు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో సమస్యలపై బిజెపి, జనసేన కలిసి పోరాడే అవకాశాలు కనపడుతున్నాయి. ఇక రాష్ట్రంలో మహిళలపై పోలీసుల ప్రతాపం గురించి కూడా పవన్ నడ్డా దృష్టికి తీసుకువెళ్ళారని రాజకీయ వర్గాలు అంటున్నారు.