బాల‌య్య ఫ్యాన్స్‌కు సంక్రాంతి: రూర‌ల్ రిలీజ్ డేట్ ఫిక్స్‌

-

యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ అభిమానుల‌కు ముందే సంక్రాంతి పండ‌గ వ‌చ్చేసింది. బాల‌య్య న‌టిస్తోన్న 105వ సినిమా ప్రాజెక్టు టైటిల్ అఫీషియ‌ల్ ఎనౌన్స్‌మెంట్‌తో పాటు సినిమా రిలీజ్ డేట్ కూడా వ‌చ్చేసింది. వాస్త‌వానికి ఈ సినిమాకు రూర‌ల్ అన్న టైటిల్ దాదాపు ఖ‌రారైన‌ట్టు ముందు నుంచే వార్త‌లు వ‌స్తున్నాయి. వీటిని నిజం చేస్తూ తాజా పోస్ట‌ర్‌తో అదే టైటిల్ ఖ‌రారు చేశారు.

దీపావ‌ళి కానుక‌గా రిలీజ్ అయిన ఈ పోస్ట‌ర్‌లో బాల‌య్య పోలీస్ గెట‌ప్‌లో గెడ్డంతో పెద్ద సుత్తి ప‌ట్టుకుని విల‌న్ల‌ను వేటాడ‌డానికి రెడీగా ఉన్న‌ట్టు ఉన్నాడు. ఓ ప‌వ‌ర్ ఫుల్ యాక్ష‌న్‌కు సంబంధించిన సీన్‌గా అది క‌నిపిస్తోంది. సీకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యాన‌ర్ స‌మ‌ర్ప‌ణ‌లో హ్యాపీ మూవీస్ ప‌తాకంపై సీ క‌ళ్యాణ్ ఈ సినిమాను నిర్మిస్తుండ‌గా కేఎస్‌.ర‌వికుమార్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు.

గ‌తంలో ఇదే కాంబోలో వ‌చ్చిన జై సింహా సినిమా క‌మ‌ర్షియ‌ల్‌గా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మంచి విజ‌యం న‌మోదు చేసింది. దీంతో రూల‌ర్‌పై మంచి అంచ‌నాలు ఉన్నాయి. ఈ సినిమాలో సోనాల్ చౌహాన్ , వేదిక హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఇక ప‌క్కా యాక్ష‌న్ అండ్ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ సినిమా తెర‌కెక్క‌నుంది.

ఇక ఈ పోస్ట‌ర్‌లోనే ఈ సినిమాను డిసెంబ‌ర్ 20న రిలీజ్ చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. సో సంక్రాంతికి వ‌స్తుంద‌నుకున్న సినిమా ముందే వ‌చ్చేయ‌డంతో బాల‌య్య అభిమానుల ఆనందానికి అవ‌ధులు ఉండ‌వు.

Read more RELATED
Recommended to you

Latest news