ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా.. మెగా, నందమూరి కుటుంబాల మధ్య సినిమాల పరంగానే కాక, రాజకీయ పరమైన వైరం కూడా ఉంది. హీరోలు కూడా ఈ విషయం ఒప్పుకున్నా… ఒప్పుకోకపోయినా వాళ్లకు కూడా ఇది తెలుసు. అభిమానులు కూడా ఇదే మైండ్‌సెట్‌తో ఉంటారు. ఈ నేపథ్యంలో ఈ రెండు ఫ్యామిలీల హీరోల్లో ఒకరు ఇంకో ఫ్యామిలీ హీరోల గురించి ఏం మాట్లాడినా అది ఆసక్తికరమే అవుతుంది.
ఈ రెండు ఫ్యామిలీల్లో ఎవరైనా మరో ఫ్యామిలీ హీరో గురించి పొగిడితే అది మరింత ఇంట్రస్ట్ అవుతుంది. తాజాగా బాలయ్య చిన్నల్లుడు ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి గురించి పాజిటివ్‌గా మాట్లాడడం సంచలనమైంది. ఈ ఇంటర్వ్యూలో చిరంజీవితో పోలిస్తే బాలయ్య కెరీర్లో వైవిధ్యమైన పాత్రలు.. పెర్ఫామెన్స్ ఓరియెంటెడ్ రోల్స్ తక్కువ చేశాడనే విషయాన్ని ప్రస్తావించాడు.
ఈ ప్రశ్నకు భరత్ ఆన్సర్ ఇస్తూ చిరంజీవి ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా కష్టపడి ఎదిగారని… అందుకే ఆయనకు ముందు నుంచే డిఫరెంట్ క్యారెక్టర్లు చేసే అవకాశం లభించిందని అన్నాడు. బాలయ్య ఎన్టీఆర్ వారసుడిగా ఇండస్ట్రీలోకి రావడం… ఓ బ్యాగేజ్‌తో సినిమాల్లోకి దిగడంతో ఆ ఛాన్స్ రాలేదని చెప్పాడు. ఏదేమైనా బాలయ్య అల్లుడు తన మావయ్యను తక్కువ చేసి మాట్లాడినట్టు కాకపోయినా ఉన్న వాస్తవాన్ని చెప్పడం… అదే టైంలో చిరంజీవి గురించి పాజిటివ్‌గా మాట్లాడడంతో ఇటు నందమూరి, అటు మెగా అభిమానుల్ని ఆశ్చర్యానికి గురి చేసింది.
ఈ సందర్భంగానే చిరు నటించిన ‘ఇంద్ర’ సినిమా అంటే తనకెంతో ఇష్టమని కూడా భరత్ చెప్పాడు. బాలయ్య చిత్రాల్లో ‘సమరసింహారెడ్డి’, ‘గౌతమీపుత్ర శాతకర్ణి’లను చాలా ఇష్టపడతానని భరత్ అన్నాడు. ఇక భరత్ ఇదే ఇంటర్వ్యూలో టీడీపీకి జూనియర్ ఎన్టీఆర్ అవసరం లేదని చేసిన వ్యాఖ్యలు కూడా సంచలనమైన సంగతి తెలిసిందే.