వినాయకుడి శోభాయాత్రలో కత్తిలో యువకుడు హల్చల్ చేశాడు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం వీరులపాడు మండలం నరసింహారావు పాలెంలో జరిగిన శోభాయాత్రలో ఓ యువకుడు కత్తితో హల్చల్ చేయడం ఇప్పుడు వైరల్ గా మారింది. దీంతో భక్తులు భయాందోళనకు గురయ్యారు.

ఇలాంటి వారిపై తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ గా మారాయి.
ఇది ఇలా ఉండగా… గణేష్ శోభాయాత్ర నిమజ్జనానికి సర్వం సిద్ధం చేశారు హైదరాబాద్ పోలీసులు. 30 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు నేపథ్యంలో గణేష్ శోభాయాత్ర నిర్వహించనున్నారు. విధుల్లో 3200 మంది ట్రాఫిక్ పోలీసులు ఉంటారు. 20,000 మంది జీహెచ్ఎంసీ సిబ్బంది విధులు నిర్వహిస్తారు.
వినాయకుడి శోభాయాత్రలో కత్తిలో యువకుడు హల్చల్..
ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం వీరులపాడు మండలం నరసింహారావు పాలెంలో జరిగిన శోభాయాత్రలో ఓ యువకుడు కత్తితో హల్చల్ చేశాడు
దీంతో భక్తులు భయాందోళనకు గురయ్యారు
ఇలాంటి వారిపై తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు pic.twitter.com/GwyuCpF0La
— BIG TV Breaking News (@bigtvtelugu) September 6, 2025