ఈ సముద్రంలో మునిగిపోలేరట..! కారణం అదే కావొచ్చు.!

-

ఈతకొట్టడం రాకుండా.. బావిలో కాదు కదా.. చిన్న కొలనులోకి కూడా దిగకూడదు.. కానీ ఈ సముద్రంలోకి దిగొచ్చు.. అవును.. మీకు ఈతరాకున్నా.. ఇందులో దిగొచ్చు.. ఎందుకంటే.. ఈ సముద్రంలో మునగలేరుగా..! ఏంటి నమ్మడం లేదా..? నిజమండీ.. ఈ సముద్రంలో మీరు కావాలని మునగాలనుకున్నా మునగలేరట.. ఇందులో అధికంగా ఉండే ఉప్పు వల్లే జనాలు సముద్రంలోకి దిగినా మునిగిపోరు అంటున్నారు.. ఇంతకీ ఈ వెరైటీ సముద్రం ఎక్కడుంది..? ఏంటా కథ చూద్దామా..!
జోర్డాన్, ఇజ్రాయెల్ మధ్య ఉన్న డెడ్ సీ.. ఇది ప్రపంచంలోని అన్ని సముద్రాల కంటే ఎక్కువ ఉప్పగా ఉండే సముద్రం. ఈ సముద్రంలోని నీరు అత్యంత ఉప్పుగా ఉండడంతో ఇతర సాలమండర్ల కంటే 6 నుండి 7 రెట్లు ఎక్కువ ఉప్పు లభిస్తుందట. నీటిలో ఉప్పు ఎక్కువగా ఉండటంతో ఇక్కడ ఎవరూ మునిగిపోరు. దీంట్లో నీటి ప్రవాహం దిగువ నుండి పైకి ఉంటుంది. కాబట్టి.. మీరు నేరుగా పడుకుని ఈ సముద్రంలో మునిగిపోలేరు. దీనితో ఈ సముద్రం తీరం ఎల్లప్పుడూ పర్యాటకుల సందడి నెలకొని ఉంటుంది.
ఈ సముద్రంలో ఇంకో హైలెట్‌ ఎంటంటే… ఈ సముద్రంలో స్నానం చేస్తే.. ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. స్నానం చేస్తే మనుషుల రోగాలు పోతాయి. అందుకే ఇది కేవలం సముద్రం మాత్రమే కాదు, వేల సంవత్సరాల క్రితం మానవాళికి ప్రకృతి ఇచ్చిన వరంగా చెప్తారు.. ఈ సముద్రంలోని ఉన్న లక్షణాల కారణంగా.. 2007లో ప్రపంచంలోని 7 కొత్త అద్భుతాల జాబితాలో ఒకటిగా ఇది చేర్చబడింది.
ఈ సముద్రపు నీరు చాలా ఉప్పగా ఉంటుంది. ఇక్కడ మొక్క కాదు కదా.. చిన్న గడ్డి కూడా మొలవదు. అంతేకాదు ఈ సముద్రంలో చేపలు, ఇతర జీవులు కనిపించవు. అందుకే గ్రీకు రచయిత ఈ సముద్రానికి డెడ్ సీ అని పేరు పెట్టాడు. అయితే దీనిని అనేక ఇతర పేర్లతో పిలుస్తారు. హిబ్రూలో దీనిని ఉప్పు సముద్రం అని పిలుస్తారు. ఈ సముద్రానికి కాలక్రమంలో అనేక పేర్లు మారాయి. అయితే ఎక్కువగా మృత సముద్రంగా గుర్తింపు సొంతం చేసుకుంది.
-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Exit mobile version