టాలీవుడ్ హీరో నందమూరి బాలయ్య కు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అఖండ సినిమాతో బంపర్ హిట్ కొట్టాడు నందమూరి బాలయ్య. అయితే.. ఈ సినిమా తర్వాత క్రాక్ మూవీతో ఫుల్ ఫామ్ లో ఉన్న… గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ తన 107 వ సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.
అయితే.. ఈ మూవీ పూర్తి కాగానే.. టాలీవుడ్ సక్సెస్ డైరెక్టర్ అనీల్ రావిపుడి తో బాలయ్య సినిమా చేయనున్నారని టాక్ వినిపిస్తోంది. రామారావు అనే టైటిల్ తో బాలయ్య కోసం ఓ క్రేజీ కథ కూడా అనీల్ రావిపుడి రెడీ చేసారట.
గోపిచంద్ మలినేని సినిమా పూర్తి కాగానే… బాలయ్య 108 వ సినిమాగా అనీల్ రావిపుడి సినిమా ఉంటుందని తెలుస్తోంది. జూలై, ఆగస్టు నెలలో ఈ సినిమాకు సంబంధించిన ఎనౌ న్స్‌మెం ట్ వస్తుందని తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా మిగతా కాస్ట్ అండ్ క్రూ కూడా ప్రకటించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. కాగా… ప్రస్తుతం ఎఫ్ 3 సినిమా ప్రమోషన్ లో ఉన్నారు అనీల్ రావిపుడి.