తప్పుడు కేసులకు టీఆర్ఎస్ పార్టీ భయపడదు: బాల్క సుమన్

-

ఢిల్లీ లిక్కర్ అవకతవకల వ్యవహారం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపుతోంది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హస్తం కూడా ఉందనే కామెంట్ల నేపథ్యంలో రగడ కొనసాగుతోంది. బీజేపీ నేతల కామెంట్లకు..టీఆర్ఎస్ పార్టీ అదేస్థాయిలో కౌంటర్ ఇస్తోంది. నిన్న కవిత ఇంటిని బీజేవైఎం ముట్టడించిన సంగతి తెలిసిందే. వారి తీరును టీఆర్ఎస్ నేతలు ఖండించారు. చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ బీజేపీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌పై కుటుంబంపై బీజేపీ చిల్లర ఆరోపణలు చేస్తోందని బాల్క సమన్ అన్నారు. వారు చేసే నీచాతి నీచ వ్యాఖ్యలను జనం చూస్తున్నారని పేర్కొన్నారు బాల్క సమన్.

తప్పుడు కేసులకు అదరం బెదరం అని చెప్పారు బాల్క సమన్. ఏ విషయంలోనైనా.. కాంప్రమైజ్ అయ్యే నైజం కేసీఆర్‌ది కాదని కుండబద్దలు కొట్టారు. కేసీఆర్ మనస్తత్వం అలాంటిది అయి ఉంటే.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడేదే కాదని బాల్క సమన్ చెప్పారు. తమ పార్టీ ఒక స్పష్టమైన అంశంతో ముందుకు వచ్చిందని సుమన్ గుర్తుచేశారు. ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్రం తమ ఎజెండా అని.. ఇప్పుడు తెలంగాణ అభివృద్ది అని సెలవిచ్చారు. కాసులకు ఆశపడే పార్టీ తమది కాదని పేర్కొన్నారు బాల్క సమన్. అవీ ఏ పార్టీలో అందిరికీ తెలుసు అని చెప్పారు. కేసీఆర్‌ను ఎదుర్కొనే ధైర్యం ఎవరికీ లేదని చెప్పారు. ముఖ్యంగా బీజేపీకి అసలే లేదని చెప్పారు. కమలం పార్టే కళంకితుల పార్టీ అని చెప్పారు బాల్క సమన్.

Read more RELATED
Recommended to you

Exit mobile version