Breaking News :రాజాసింగ్ బెయిల్ పిటిషన్ కొట్టేసిన నాంపల్లి కోర్టు

-

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఓ వ‌ర్గంపై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే రాజాసింగ్ లు పోలీసులు అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. ఎమ్మెల్యే రాజాసింగ్‌కు నాంప‌ల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అయితే ఈ నేపథ్యంలో గోషామ‌హ‌ల్ ఎమ్మెల్యే రాజాసింగ్ బెయిల్ పిటిష‌న్‌ను నాంప‌ల్లి కోర్టు తిర‌స్క‌రించింది. కోర్టు ఆదేశాల మేర‌కు రాజాసింగ్‌ను చంచ‌ల్‌గూడ జైలుకు పోలీసులు త‌ర‌లించారు. చంచ‌ల్‌గూడ జైలు వ‌ద్ద పోలీసులు ప‌టిష్ట బందోబ‌స్తు ఏర్పాటు చేశారు.

చాంద్రాయ‌ణ‌గుట్ట‌, మ‌ల‌క్‌పేట్‌, చార్మినార్ వెళ్లే దారుల‌తో పాటు చంచల్‌గూడ జైలు ప‌రిస‌రాల్లో పోలీసులు భారీగా మోహ‌రించారు. ఇక నాంప‌ల్లి కోర్టు వ‌ద్ద రాజాసింగ్ అనుచ‌రులు హంగామా సృష్టించారు. కోర్టు వ‌ద్ద అనుకూల‌, వ్య‌తిరేక వ‌ర్గాల మ‌ధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో పోలీసులు ఇరు వ‌ర్గాల‌ను చెద‌ర‌గొట్టారు. పోలీసులు లాఠీల‌కు ప‌ని చెప్పారు. నాంప‌ల్లి నుంచి చంచ‌ల్‌గూడ జైలుకు వెళ్లే దారిని త‌మ ఆధీనంలోకి తీసుకున్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version