కాంగ్రెస్ సంచులు మోసుడు..బీజేపీ చెప్పులు మోసుడు – బాల్క సుమన్

-

కాంగ్రెస్ సంచులు మోసుడు..బీజేపీ చెప్పులు మోసుడు అంటూ ప్రభుత్వ విప్ బాల్క సుమన్ సెటైర్లు పేల్చారు. మరోసారి బండి సంజయ్ బానిస అని నిరూపించుకున్నాడు. ఢిల్లీకి చెప్పులు మోసుడు బీజేపీకి అలవాటు అని చురకలు అంటించారు. ఢిల్లీకి సంచులు మోసుడు కాంగ్రెస్ కు అలవాటన్నారు. కవిత ఇంటిపై దాడిని ఖండిస్తున్నామని పేర్కొన్నారు బాల్క సుమన్.

తెలంగాణలో హనుమంతుని గుడి లేని ఊరు లేదు.. కేసీఆర్ సంక్షేమ పథకాలు లేని ఇల్లు లేదని పేర్కొన్నారు. కేసీఆర్ మునుగోడు సభలో అడిగిన ప్రశ్నలకు ఒక్కదానికి కూడా బీజేపీ సమాధానం చెప్పలేక పోయిందని ఆగ్రహించారు.

కవితకు బీజేపీ నేతలు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. మీ ఇళ్ల మీదకి రావాలంటే మాకు పెద్ద విషయం కాదు, మా టీఆర్ఎస్ సైన్యం ఎంతో మీకు తెలుసా ? అని తలసాని తరహాలో బాల్కసుమన్‌ వార్నింగ్‌ ఇచ్చారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం అయితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు బాల్క సుమన్‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version