హుజురాబాద్ ప్రచారంలో భాగంగా రేవంత్ రెడ్డి, బండి సంజయ్‌లపై బాల్క సుమన్ ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి, బండి సంజయ్ లు ఇద్దరు కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని… ఓటుకు నోటు కేసులో దొరికిన A1 దొంగ రేవంత్ రెడ్డికి కేసీఆర్ పై మాట్లాడే అర్హత లేదని మండిపడ్డారు. తుపాకి రాముడు రేవంత్ రెడ్డి, తోక రాముడు బండి సంజయ్ అని… మీ పదవులు కూడా కేసీఆర్ పెట్టిన బిక్ష మాత్రమే అని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. రెండున్నర సంవత్సరాలు గడిచిన ఎంపీ గా బండి సంజయ్… హుజురాబాద్ నియోజకవర్గానికి ఏమి చేసాడో చెప్పాలని.. కొత్త బిచ్చగాడు పొద్దు ఎరుగడు అన్నట్లు రేవంత్ రెడ్డి వ్యవహారం ఉందన్నారు.
ఆనాడే కమలాపూర్ నియోజకవర్గ టీఆరెస్ కంచు కోట అని… 2004లో ఎమ్మెల్యే గా ఈటలకు అవకాశం ఇచ్చారన్నారు. కేసీఆర్ 19 సంవత్సరాలు ఒక పెద్ద కొడుకుగా రాజేందరన్నను చూసాడని… ఆయనకు ఇచ్చినన్నీ అవకాశాలు ఎవ్వరికీ ఇవ్వలేదని పేర్కొన్నారు.
మాములుగా కోళ్ల ఫామ్ నడుపుకునే రాజేందరన్నను రాష్ట్రంలో రెండో స్థానంలో ఉంచారని స్పష్టం చేశారు. శత్రువులతో చేతులు కలిపి రాష్ట్రాన్ని పార్టీని విచ్ఛిన్నం చేసే కుట్ర ఈటల చేశారని… ఎమ్మెల్సీ ఎన్నికలలో పార్టీ వ్యక్తులకు కాకుండా వేరే పార్టీకి మద్దతు ఇచ్చాడని ఆరోపించారు బాల్క సుమన్. ప్రభుత్వ సిబ్బందిని, వాహనాలను వదిలివేసి సొంత కారులో వెళ్లి రహాస్య మీటింగ్ లు పెట్టాడని ఫైర్ అయ్యారు.