టీఆర్ఎస్ పార్టీ చేసిన తీర్మాణాలపై సమాధానం ఇచ్చే దమ్ము లేక బీజేపీ పార్టీ ఎదురుదాడి చేస్తుందని విమర్శించారు ప్రభుత్వ విప్ బాల్కసుమన్. ప్రజా సంగ్రామ యాత్ర పేరిట బీజేపీ పాపాల యాత్ర చేస్తుందని విమర్శించారు. టీఆర్ఎస్ ప్లీనరీతో బీజేపీ నాయకుల వెన్నులో వణుకు మొదలైందని… మీ బండారం గల్లీలో కాదు ఢిల్లీలో బయటపెడుతాం అని హెచ్చరించారు. ఇద్దరు దోస్తుల కోసం దేశ సంపదను బీజేపీ పంచిపెడుతుందని విమర్శించారు. ఇది కమలం పార్టీ కాదని కార్పొరేట్ పార్టీ అని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజల కోసం సంపదను పంచిపెడుతుందని బాల్క సుమన్ అన్నారు.
బీజేపీ కమలం పార్టీ కాదు… కార్పొరేట్ పార్టీ : బాల్క సుమన్
-