ప్రస్తుత ప్రపంచంలో ఒత్తిడి సర్వసాధారణం అయిపోయింది. పని పని అంటూ పొద్దున్న లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు తిరిగే మనిషికి ఒత్తిడి కాక మరేమీ ఉంటుంది. అయితే కొన్నిసార్లు ఒత్తిడిని తట్టుకోలేక తీవ్ర సమస్యలు కొనితెచ్చుకుంటున్నాడు మనిషి.
ఒత్తిడిని ఎలాగో దూరం చేసుకోలేం. కానీ దాన్ని తగ్గించుకోవచ్చు. ఒత్తిడిని తట్టుకోవడం అనేది నీవు తీసుకునే ఆహారంపై కూడా ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం ఒత్తిడి ఇంకా యాంగ్జయిటీని తగ్గించే ఆహారాలు ఏంటో తెలుసుకుందాం.
చేపలు:
ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు కలిగిన సాల్మన్ చేపలు మెదడుకు ఆరోగ్యాన్ని అందిస్తాయి. ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు శరీరం మీదా, మనసు మీదా ప్రభావం చూపి ఒత్తిడిని యాంగ్జయిటీని తగ్గిస్తాయి. అందుకే చేపలను మీ డైట్ లో భాగం చేసుకోండి.
ఆకుకూరలు:
పాలకూరలో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. మెగ్నీషియం వల్ల కండరాలు రిలాక్స్ అవుతాయి. రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. ఈ కారణంగా ఒత్తిడి, యాంగ్జయిటీ తగ్గుతుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం శరీరంలో మెగ్నీషియం లోపిస్తే ఒత్తిడి యాంగ్జయిటీ వంటి సమస్యలు వస్తాయని నిపుణులు తెలియజేస్తున్నారు.
డార్క్ చాక్లెట్:
డార్క్ చాక్లెట్ లో 70శాతం కోకో ఉంటుంది. కోకోలో యాంటీ ఆక్సిడెంట్స్ ఇంకా ఫ్లేవనాయిడ్స్ ఉండడం వల్ల మెదడు చురుకుగా పనిచేస్తుంది. డార్క్ చాక్లెట్ తిన్నప్పుడు మెదడులో ఎండార్పిన్స్ అనే ఫీల్ గుడ్ హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి. ఈ కారణంగా స్ట్రెస్ తగ్గిపోయి మీరు రిలాక్స్ గా ఫీల్ అవుతారు.
అవకాడో:
దీనిలో శరీరానికి అవసరమైన అనేక పోషకాలు పుష్కలంగా ఉంటాయి. మోనోసాచురేటెడ్ కొవ్వులు ఉండే అవకాడో కారణంగా మెదడు ఆరోగ్యం బాగుంటుంది. అంతేకాదు దీనిలో విటమిన్ b6 కూడా ఉంటుంది.
గమనిక: ఈ సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది, కేవలం అవగాహన కోసం మాత్రమే. “మనలోకం” ధృవీకరించడలేదు. పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.