భర్త ఉండగానే ఇద్దరితో మహిళ అక్రమ సంభంధం..

-

గుంటూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది.భర్తతో సంతోషంగా జీవితాన్ని గడపాల్సిన ఆ మహిళ ప్రియుడితో సంబంధాలు పెట్టుకుని, అంతే కాకుండా మరో యువకుడు పరిచయం కావడంతో అతడితో సన్నిహితంగా మెలిగింది.ఈ తరుణంలో ఓ యువకుడి హత్యకు ఆమె కారణమైంది. వివరాల్లోకి వెళితే గుంటూరు జిల్లాలోని వేమూరు మండలం చదలవాడ కి చెందిన అత్తోట దీప్తి, పవన్ కుమార్ (లడ్డు) 12 ఏళ్ల నుంచి ప్రేమలో ఉన్నారు. అయితే వీరిద్దరి ప్రేమకు పెద్దల అనుమతి లభించలేదు. దీంతో ఆమెను వేరే యువకునికి ఇచ్చి వివాహం జరిపించారు. పెళ్లయిన తర్వాత కూడా ప్రియుడు లడ్డు తో ఆమె పరిచయం కొనసాగించింది. అది వివాహేతర సంబంధానికి దారితీసింది. ఇదిలా ఉండగా ఆమెకు మూడేళ్లక్రితం రవి కిరణ్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు.

అతడితో సన్నిహితంగా ఉంటున్న క్రమంలో వివాహేతర సంబంధం ఏర్పడింది. మొదటి ప్రియుడు లడ్డు రౌడీషీటర్ కావడంతో రవి కిరణ్ విషయం తెలిస్తే గొడవలు అవుతాయని ఆమె గ్రహించి అతన్ని దూరం పెట్టింది. దీన్ని తట్టుకోలేక రవి కిరణ్ రోజు దీప్తి కి ఫోన్ చేసేవాడు. ఈ విషయాన్ని తన ప్రియుడు లడ్డూకి తెలిపింది. ఆమెతో ఫోన్ చేయించి రవికిరణ్ ని లడ్డు పిలిపించాడు. ఆ తరువాత ఇద్దరూ కలిసి రవి కిరణ్ ని హత్య చేసి మృతదేహాన్ని జాగర్లమూడి కాలువలో పడేశారు. మృతుడి భార్య ఫిర్యాదు తో పాటు దళిత సంఘాల ఆందోళనలతో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. విచారణలో ఈ వాస్తవాలాన్ని వెలుగు చూసాయని, నిందితులను అరెస్టు చేసినట్లు చుండూరు సిఐ బత్తుల కళ్యాణ్ రాజు వెల్లడించారు

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version