కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు శుభవార్త చెప్పింది. దేశవ్యాప్తంగా ఉన్న ఆలయాల అభివృద్ధి, టెంపుల్ టూరిజం కోసం కేంద్రంలోని మోడీ సర్కార్ కొత్తగా ‘ప్రసాద్’ స్కీంను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా ‘ప్రసాద్’ పథకానికి హైదరాబాద్‌లోని బల్కంపేట రేణుక ఎల్లమ్మ దేవస్థానం ఎంపికైంది.
ఈ క్రమంలోనే ఆలయ అభివృద్ధి పనులకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ వివరాలను సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ ప్రకటించారు. ఈ ప్రాజెక్టు ద్వారా రూ.4.21 కోట్ల వ్యయంతో ఒకేసారి 200 మందికి పైగా వసతి కల్పించే ఆధునిక సౌకర్యాలతో కూడిన 3 అంతస్తుల అన్నదాన భవనాన్ని అభివృద్ధి చేస్తామని కేంద్రం ప్రకటించింది.