కేంద్ర సమాచార, సాంకేతిక మంత్రిత్వ శాఖ చైనాకు చెందిన 59 యాప్‌లను నిషేధించాక.. చైనా ప్రభుత్వం భారత్‌కు చెందిన న్యూస్ యాప్‌లు, వెబ్‌సైట్లను తమ దేశంలో నిషేధించింది. అయితే బ్లాక్ అయిన సైట్లు, యాప్‌లను యాక్సెస్ చేసేందుకు ఉపయోగించే వీపీఎన్ సర్వర్లను కూడా చైనా తమ దేశంలో బ్యాన్ చేసింది. వాటిని కూడా నియంత్రించే విధంగా సమర్థవంతమైన ఫైర్‌వాల్‌ను చైనా ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో చైనా తీసుకున్న నిర్ణయాన్ని ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ వ్యతిరేకించింది.
చైనాకు చెందిన న్యూస్ వెబ్‌సైట్లు, యాప్‌లను కూడా భారత్‌లో నిషేధించాలని ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ (ఐఎన్‌ఎస్) అధ్యక్షుడు శైలేష్ గుప్తా కేంద్రాన్ని కోరారు. ఇందుకు డిజిటల్ న్యూస్ పబ్లిషర్స్ అసోసియేషన్ (డీఎన్‌పీఏ) కూడా మద్ధతు తెలిపింది. ఇండియా, చైనా సరిహద్దు వివాదంపై భారత్‌లోని వెబ్‌సైట్లు, న్యూస్ యాప్స్ ప్రచురించే వాస్తవమైన కథనాలను చైనా ప్రజలకు తెలియకుండా చేసేందుకే చైనా ప్రభుత్వం భారత్‌కు చెందిన న్యూస్ యాప్స్, వెబ్‌సైట్లను నిషేధించిందని ఐఎన్‌ఎస్ ఆరోపించింది. కనుకనే చైనా న్యూస్ సైట్లను కూడా బ్యాన్ చేయాలని ఐఎన్‌ఎస్ కోరింది.
అంతేకాకుండా చైనాతో ఉన్న సంబంధాలను భారత్ కట్ చేసుకోవాలని, చైనా దేశ కంపెనీలు మన దేశ న్యూస్ చానల్స్, మీడియా సంస్థల్లో పెట్టుబడులు పెట్టకుండా చూడాలని కూడా ఐఎన్‌ఎస్ కోరింది. అయితే దీనిపై కేంద్రం ఇంకా స్పందించాల్సి ఉంది.