డయబెటిస్‌కు మందులే కాదు.. నాచురల్‌గా షుగర్‌ను నియంత్రణలో ఉంచుకోవడానికి ఎన్నో ఉన్నాయి. ములగ ఆకు, జామ ఆకు, సీతాఫలం ఆకు, మెంతి ఆకు ఇలా వివిధ రకాల ఆకుల కషాయలు షుగర్ లెవల్స్‌ను కంట్రోల్‌లో ఉంచుతాయి.
అరటి పువ్వు: డయాబెటిస్‌పై అరటి పువ్వు ప్రభావాన్ని గుర్తించడానికి గత దశాబ్దంలో అనేక అధ్యయనాలు, జంతు పరీక్షలు జరిగాయి. అరటి పువ్వులో డయాబెటిక్ వ్యతిరేక లక్షణాలు ఉన్నాయని, మధుమేహ వ్యాధిగ్రస్తులు తమ ఆహారంలో అరటి పువ్వు చేర్చడం వల్ల పాలియురియా, హైపర్గ్లైసీమియా, శరీర బరువు హెచ్చుతగ్గులు వంటి ఇతర మధుమేహ లక్షణాలను కూడా తగ్గిస్తుందని పరిశోధకులు కనుగొన్నారు. అరటి పువ్వులో కేలరీలు తక్కువగా ఉంటాయి, కానీ ఫైబర్ అధికంగా ఉంటుంది.ఇందులో ఉండే సాలిబుల్ ఫైబర్ శరీరంలోని కొలెస్ట్రాల్ , రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. అయితే కరగని ఫైబర్ మలబద్ధకం, ఇతర జీర్ణ సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది. అరటి పువ్వు తినడం వల్ల మధుమేహం అదుపులో ఉంటుంది. నిజానికి అరటి పువ్వులో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది.
సదాబహార్ పువ్వులు: అరటి పువ్వుతో పాటు… సదాబహార్ పువ్వులు (సతత హరిత) సైతం మధుమేహం వ్యాధిగ్రస్తులకు మేలుచేస్తాయంటున్నారు నిపుణులు. ఉదయం అల్పాహారం చేసిన వెంటనే వీటిని తినొచ్చు.. 5 నుంచి 6 సదాబహార్ పువ్వులను అలాగే తినవచ్చు. పింక్ కలర్, తెలుపు ఏ రకం పువ్వులు అయినా సరే అద్భుతంగా పనిచేస్తాయి. వాటిని తిన్న వెంటనే నీళ్లు తాగాలి. ఎందుకంటే ఇవి చాలా చేదుగా ఉంటాయి. సతత హరిత పువ్వులో ఆల్కలాయిడ్స్ ఉంటాయి. ఈ పువ్వుల వల్ల ఇన్సులిన్ ఉత్పత్తి అవుతుంది. తద్వారా చెక్కర అదుపులో ఉంటుంది.
ఈ పువ్వులు మీకు దొరికితే వాడి చూడండి. అయితే ఇప్పటికే మధుమేహానికి మందులు వేసుకునే వారు అయితే వైద్యుల సలహా మేరకు మాత్రమే తగిన మోతాదులో ఈ చిట్కాలను పాటించాల్సి ఉంటుంది.