అభివృద్ధి కార్యక్రమంలో రాజకీయం అవసరం లేదు : బండి సంజయ్‌

-

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా RFCL ప్రారంభించనున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర
అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌, కేంద్రమంత్రి భగవంత్‌ ఖుబాలు మోడీ పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా బండి సంజయ్‌ మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా RFCL ప్రారంభం కానుండటం రామగుండం ప్రజల అదృష్టమని అన్నారు. రైతులకు మేలు చేయడానికి, వారి ఆదాయం రెట్టింపు చేసేందుకు మోడీ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని తెలిపారు బండి సంజయ్‌. నరేంద్రమోడీ ప్రధాని అయ్యాక వ్యవసాయ రంగంలో జరిగిన సంస్కరణలతో రైతుల ఆత్మహత్యలు చాలా తగ్గాయని బండి సంజయ్‌ చెప్పారు.

ఒక బస్తా యూరియా ఖరీదు రూ. 3700 అయితే రూ. 3500 సబ్సిడీ ఇచ్చి రైతులకు రూ.200కే కేంద్రం అందిస్తోందన్నారు బండి సంజయ్‌. రైతును రాజును చేయడమే మోడీ లక్ష్యంగా పెట్టుకున్నారని బండి సంజయ్ తెలిపారు. ఈనెల 12వ తేదీన RFCLతో పాటు మూడు జాతీయ రహదారులను మోడీ ప్రారంభించనున్నారని సంజయ్ వెల్లడించారు. 75అసెంబ్లీ నియోజకవర్గాల్లో LCD స్క్రీన్ లను ఏర్పాటు చేసి రైతులందరూ మోడీ పర్యటనను వీక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అభివృద్ధి కార్యక్రమంలో రాజకీయం అవసరం లేదన్న బండి సంజయ్…అందరం కలిసి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని బండి సంజయ్‌ సూచించారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version