Breaking : ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

-

ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో కీలక మలుపు తిరిగింది. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫామ్ హౌస్ కేసులో విచారణ కోసం స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీంను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీీవీ ఆనంద్ నేతృత్వంలో ఈ బృందాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇందులో ఆరుగురు పోలీసు అధికారులను కూడా భాగస్వామ్యులను చేసింది. సిట్‌లో నల్గొండ ఎస్పీ రెమారాజేశ్వరి, సైబరాబాద్‌ క్రైమ్స్‌ డీసీపీ కల్మేశ్వర్‌, శంషాబాద్‌ డీసీపీ జగదీశ్వర్‌ రెడ్డి, నారాయణపేట్‌ ఎస్పీ వెంకటేశ్వర్లు, రాజేంద్రనగర్‌ ఏసీపీ గంగాధర్‌, మొయినాబాద్‌ ఎస్‌హెచ్‌ఓ లక్ష్మీరెడ్డిలను సభ్యులుగా చేర్చింది తెలంగాణ ప్రభుత్వం.

ఫాం హౌస్ కేసులో హైకోర్టు స్టే ఎత్తివేయడంతో వెంటనే ప్రభుత్వం స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీం ను ఏర్పాటు చేసింది. మొయినాబాద్ ఫాం హౌస్ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ కొనుగోళ్ల వ్యవహారంలో ఎవరెవరు భాగస్వామ్యులయ్యారు? ఎవరెవరి ప్రమేయం ఉందన్న దానిపై ఈ బృందం ఆరా తీయనుంది. జైల్లో ఉన్న నిందితులను ఈ టీం తమ కస్టడీలోకి తీసుకుని విచారించే అవకాశాలున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version