ఎస్సై, కానిస్టేబుల్ పరీక్షలో అభ్యర్థులకు అన్యాయం: బండి సంజయ్‌

-

ఎస్సై, కానిస్టేబుల్ పరీక్షలో అభ్యర్థులకు అన్యాయం జరిగిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. తప్పులు సరిదిద్దాలని ఆందోళన చేస్తే.. వారిపట్ల అమానుషంగా వ్యవహరిస్తారా? అని మండిపడ్డారు. పరీక్షలు సక్రమంగా నిర్వహించడం చేతకాని కేసీఆర్ సర్కార్కు నిరుద్యోగుల ఉసురు తగులుతుందన్నారు బండి సంజయ్‌. అయితే.. కరీంనగర్ స్మార్ట్ సిటీ అభివృద్ధి పనులను బండి సంజయ్ సమీక్షించారు. స్మార్ట్ సిటీ పథకంలో భాగంగా జరుగుతున్న పనుల పురోగతి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. కేంద్రం ఇప్పటికే ఫండ్స్ మంజూరు చేసిందని.. రాష్ట్ర ప్రభుత్వం నిధులు కూడా వెంటనే నిధులు విడుదల చేసి పనులు పూర్తయ్యేలా చూడాలన్నారు.

స్మార్ట్ సిటీ పనులు మందకొడిగా కొనసాగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. కాగా 2017 జూన్ 23న కరీంనగర్కు స్మార్ట్ సిటీ హోదా కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే అభివృద్ధి పనులు మాత్రం ఇంకా పూర్తి కాలేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version