బీజేపీ టార్గెట్ గానే టీఆర్ఎస్ రాజకీయం నడుపుతుంది…తమ ప్రభుత్వం తప్పులని కనబడనివ్వకుండా, కేవలం కేంద్ర ప్రభుత్వంపై టీఆర్ఎస్ నేతలు ఫోకస్ పెట్టారు…కేంద్రం అది చేయట్లేదు…ఇది చేయట్లేదు అంటూ కేవలం బీజేపీని, తెలంగాణ ప్రజల దృష్టిలో విలన్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు…తెలంగాణలో బీజేపీ రోజురోజుకూ పుంజుకుంటుందనే నేపథ్యంలోనే టీఆర్ఎస్ నేతలు బీజేపీ టార్గెట్ గానే రాజకీయం చేస్తున్నారు.
విచిత్రం ఏంటంటే రాష్ట్రంలో అధికారంలో ఉంది టీఆర్ఎస్ ప్రభుత్వం..ఆ ప్రభుత్వం చేసే తప్పులని బీజేపీ నేతలు ఎత్తిచూపుతున్నారు. అయితే వాటికి కౌంటర్లు ఇవ్వకుండా టీఆర్ఎస్ ఎదురుదాడి చేస్తుంది..అంటే డైరక్ట్‌గా కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తుంది. కేంద్రం..రాష్ట్రానికి ఏమి చేయడం లేదనే కొనని బాగా హైలైట్ చేస్తున్నారు. కేసీఆర్ గాని, కేటీఆర్ గాని అదే పనిలో ఉంటున్నారు. ఇటీవల కేసీఆర్ కాస్త సైలెంట్ అవ్వడంతో కేటీఆర్ దూకుడుగా రాజకీయం చేయడం మొదలుపెట్టారు. అయితే కేటీఆర్ విమర్శలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సైతం తనదైన శైలిలో కౌంటర్లు ఇచ్చేస్తున్నారు.
ఇక తాజాగా కేటీఆర్..కరీంనగర్ పర్యటనకు వెళ్ళి..అక్కడొక సవాల్ చేశారు…గత పార్లమెంట్ ఎన్నికల్లో అడ్డిమారి గుడ్డిదెబ్బతో అదృష్టవశాత్తు కరీంనగర్ ఎంపీగా గెలిచారని, అలాగే బీజేపీ అధ్యక్షుడు కూడా అయ్యాడని, అయితే ఈ సారి దమ్ముంటే కరీంనగర్ అసెంబ్లీలో నిలబడి తమ మంత్రి గంగుల కమలాకర్‌పై గెలవాలని కేటీఆర్ సవాల్ చేశారు.
అయితే గత మూడు ఎన్నికల్లోనూ బండి…బీజేపీ నుంచి పోటీ చేస్తూ గంగులపై ఓడిపోతూ వస్తున్నారు. 2018 ఎన్నికల్లో కూడా 14 వేల ఓట్ల మెజారిటీతో గంగులపై ఓడిపోయారు. ఇక 2019 పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ ఎంపీగా గెలిచారు. ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో బండి మళ్ళీ కరీంనగర్ అసెంబ్లీలోనే పోటీ చేస్తారని తెలుస్తోంది. ఓడిన చోటే గెలవాలని చూస్తున్నారు. పైగా వరుసగా ఓడిపోయిన సానుభూతి సంజయ్‌పై ఉంది…అటు మంత్రి గంగులపై ప్రజా వ్యతిరేకత పెరుగుతుంది. ఈ పరిణామాల నేపథ్యంలో కరీంనగర్ అసెంబ్లీలో గంగులపై బండి పైచేయి సాధించేలా ఉన్నారు..చూడాలి మరి కేటీఆర్ సవాల్ నిజమవుతుందో లేదో.