ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిమాన సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా కేంద్రమంత్రి బండి సంజయ్ వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ బహిష్కృత నేత బక్క జడ్సన్ సంచలన ఆరోపణలు చేశారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్, బీజేపీ నేతలపై ఆయన విరుచుకపడ్డారు.లగచర్లలో గిరిజనుల మీద దాడులు జరుగుతుంటే బీజేపీ వాళ్లు మూసీ నిద్ర చేస్తున్నారని,లగచర్ల ఘటనను డైవర్డ్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు.
మూసీ పరివాహక ప్రాంతంలో ఇల్లు కూలకొడుతుంటే గాడిద పళ్లు తోముతున్నారా? అని ప్రశ్నించారు. రేపు రేవంత్ తన సీఎం పదవికి రాజీనామా చేస్తే ఆయన గెలుపుకోసం బీజేపీ నేతలే ముందుకు వస్తారని వ్యాఖ్యానించారు. ఆయన రాజీనామా చేస్తే తాను కూడా పోటీలో ఉంటానని స్పష్టం చేశారు. రేవంత్ తరపున ప్రచారం చేయడానికి చంద్రబాబు, మోడీ, పవన్ కళ్యాణ్, చీఫ్ పోలింగ్ ఏజెంట్‌గా బండి సంజయ్, క్యాంపెయినర్‌గా కిషన్ రెడ్డి, పోలింగ్ ఏజెంట్‌గా విశ్వేశ్వర్ రెడ్డి వచ్చినా రేవంత్ గెలవడని విమర్శించారు.