హైదరాబాద్‌లో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి కన్నుమూత

-

సుప్రీంకోర్టు మాజీ మాజీ న్యాయమూర్తి జస్టిస్ జగన్నాథ రావు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌‌లోని ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో కొద్ది రోజులుగా చికిత్స పొందుతున్నారు. ఆదివారం అర్ధరాత్రి పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్త తెలిసిన న్యాయమూర్తులు, న్యాయవాదులు, రాజకీయ నాయకులు సంతాపం ప్రకటించారు.

జస్టిస్ జగన్నాథ రావు సర్వీసులో ఉన్న సమయంలో ఎన్నో కీలక కేసులను పరిష్కరించారు. దీనికి తోడు న్యాయ రంగంలో విశేషంగా కృషి చేశారు. ఆయన అందించిన సేవలను పలువురు న్యాయ రంగ నిపుణులు కొనియాడారు.

Read more RELATED
Recommended to you

Latest news