టీఆర్ఎస్ లా బీజేపీ ఏక్ నిరంజన్ పార్టీ కాదు…. కేటీఆర్ వ్యాఖ్యలకు బండి సంజయ్ కౌంటర్

-

నిన్న కరీంనగర్ పర్యటనలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. టీఆర్ఎస్ లా బీజేపీ ఏక్ నిరంజన్ పార్టీ కాదని.. జాతీయ పార్టీ అని ఆయన అన్నారు. ఎవరు ఎక్కడ నుంచి పోటీ చేయాలన్నది జాతీయ నాయకత్వం నిర్ణయిస్తుందని… ఒక్కసారి నిర్ణయం తీసుకున్న తరువాత ఎవరైనా సరే.. ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిందే అని అన్నారు. పార్టీ నిర్ణయం ప్రకారమే పోటీ చేయాలని ఆయన అన్నారు. టీఆర్ఎస్ సిగ్గు లేకుండా కేంద్రం నిధులు ఇవ్వలేదని మాట్లాడుతుందని విమర్శించారు. నిన్న కరీంనగర్ లో చేసిన నిధులు ఎక్కడ నుంచి వచ్చాయో చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. బీజేపీ అంటే టీఆర్ఎస్ కు భయం అని ఆయన అన్నారు. తాను లక్ష ఓట్ల మెజారిటీతో గెలిచిన విషయం కేటీఆర్ మర్చిపోయారా…? అంటూ ప్రశ్నించారు. నిన్న కరీంనగర్ సభలో మళ్లీ గంగుల కమలాకర్ పై పోటీ చేసి సంజయ్ గెలవాలని మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. అడ్డిమార్ గుడ్డిదెబ్బలో బండి సంజయ్ గెలిచారని విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version