2023లో వచ్చేది మా ప్రభుత్వమే… గోల్కొండ కోటపై కాషాయ జెండా ఎగరడం ఖాయం- బండి సంజయ్

-

2023లో వచ్చేది మా ప్రభుత్వమే.. గోల్కొండ కోటలో కాషాయ జెండా ఎగరడం ఖాయమని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. మూడు సీట్ల ఉన్న తెలంగాణలో 100 సీట్లను బీజేపీ కైవసం చేసుకుంటుందని అన్నారు.  ఉద్యోగులు ప్రభుత్వానికి భయపడొద్దని అభయం ఇచ్చారు.ఉద్యోగులను ప్రభుత్వం భయపెడుతోందని ఆయన అన్నారు. దొంగ దీక్షలు అని కేటీఆర్ నన్ను విమర్శిస్తున్నారని.. అసలు దొంగ దీక్షలు అంటే మీ నాన్నను అడగాలని కేటీఆర్ ను ఉద్దేశించి అన్నారు.

బీజేపీ దీక్షఅంటే కేసీఆర్ ప్రభుత్వానికి వణుకు పుడుతోందని బండి సంజయ్ అన్నారు. గతంలో గుర్తు రాని కోవిడ్ బీజేపీ దీక్ష అంటేనే గుర్తుకు వచ్చిందని… రాత్రికి రాత్రి ఉత్తర్వులు జారీ చేసిందని విమర్శించారు. ఎన్నికలు వచ్చినప్పుడే.. ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఉద్యోగాలు గుర్తుకు వస్తాయని… 50 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ అంటూ యువతను మోసం చేస్తున్నారని విమర్శించారు. జనవరిలోపు ఉద్యోగాలకు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వకుంటే.. అసెంబ్లీ సమావేశాలను అడ్డుకుంటామని హెచ్చిరించారు. అసెంబ్లీలో మా ట్రిపుల్ ఆర్ ప్రభుత్వాన్ని నిలదీస్తారని హెచ్చిరించారు.

ఉద్యోగాలు ఇవ్వమంటే.. 12 మంది వాలంటీర్లను, 16 వేల మంది నర్సులను, 7 వేల మంది ఫీల్డ్ అసిస్టెంట్లను తీసేసింది ఈ మూర్ఖపు ముఖ్యమంత్రి కాదా.. అని నిలదీశారు. ఉద్యోగం కోసం 600 మంది నిరుద్యోగులు మరణించారన్నారు. అయినా ఈ ముక్యమంత్రి కేసీఆర్ మనసు కరగడం లేదని విమర్శించారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణ ఎందుకు అని ప్రశ్నించారు… ప్రొఫెసర్ జయశంకర్ ఆత్మ ఘోషిస్తుందని బండి సంజయ్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version