సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో బండి సంజయ్ చేపట్టిన ప్రజాహిత యాత్ర హై టెన్షన్ సాగింది హుస్నాబాద్ మండలం రాములపల్లి లో ప్రవేశించి హుస్నాబాద్ కి చేరుకుంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఎక్కడికి అక్కడ అడ్డుకొని పోలీస్ స్టేషన్ కి తరలించారు. తర్వాత పట్నంలో అంబేద్కర్ కూడలిలో జరిగిన కార్నర్ మీటింగ్ లో బండి సంజయ్ మాట్లాడారు. అభివృద్ధి నిధుల వివరాలను వెల్లడించారు. ఎల్కతుర్తి నుండి సిద్దిపేట దాకా 660 కోట్లు ఖర్చు చేశామని మొక్కల పెంపకానికే 191 కోట్లకు పైగా నిధులు ఇచ్చిన ఇచ్చామని చెప్పారు.
ఇచ్చి నిధులు అన్ని ఎటుపోయాయో లెక్క తేల్చాలని అన్నారు ప్రజల పక్షాన పోరాడితే నాపై 100కి పైగా కేసులు పెట్టి జైలుకు పంపారని అన్నారు. ప్రజల పక్షాన కాంగ్రెస్ నేతలు చేసిన పోరాటాలు ఏంటి ఎన్ని సార్లు జైలుకు వెళ్లారో చెప్పాలని అన్నారు. ఎన్నికలకి ముందు ఇచ్చిన 6 గ్యారంటీలని వంద రోజుల్లో అమలు చేసే దమ్ముందా లేదా ఆరు గ్యారెంటీల మీద ఇందిరమ్మ బొమ్మ పెట్టుకున్నారు వాటిని అమలు చేయాలంటే ఇందిరమ్మలానే ఎమర్జెన్సీ పాలన తీసుకురావాలనుకుంటున్నారా అని అన్నారు.