సిద్దిపేట: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హుస్నాబాద్‌లో పర్యటించారు. ఉప ఎన్నికలు వస్తేనే కేసీఆర్‌కు దళితులు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు గుర్తుకొస్తారని ఆయన ఎద్దేవా చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నేటి వరకు ఏ ఒక్క హామీ నెరవేరలేదన్నారు. కేసీఆర్ ఇచ్చిన హామీలను తనకు తానే సమీక్ష చేసుకోవాలని బండి సంజయ్ సూచించారు. కరోనా సమయంలో వందలాది మంది చనిపోయిన ఏ ఒక్క రోజు కరోనా జాగ్రత్తలపై మాట్లాడలేదని విమర్శించారు. కోవిడ్ అనే వ్యాధి ఆయన వరకు వచ్చేంతవరకు దాని తీవ్రత ఆయనకు తెలియలేదని ఎద్దేవా చేశారు. కోవిడ్ సమయంలో కేంద్రం ప్రభుత్వమే నిధులు ఇచ్చిందని చెపపారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని తెలిపారు. సీఎం ఏం చేసినా కమీషన్ల కోసమేనని బండి సంజయ్ ఆరోపించారు.