రామ – భరతుల వారసత్వాన్ని మేం తలకెత్తుకున్నాం : బండి సంజయ్‌

-

మరోసారి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని, సీఎం కేసీఆర్‌ని విమర్శిస్తూ ట్విట్లు చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ఆయన ట్విట్టర్‌ వేదికగా.. ‘ఢిల్లీ లిక్కర్ మాఫియాలో పడి కొట్టుకుంటున్న కుటుంబసభ్యుల రహస్యాలు బయట పడకుండా తంటాలు పడుతూ చేస్తున్న డైవర్షన్ పాలిటిక్స్ తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు…! అవసరం ఉంటే కాళ్లు మొక్కడం… లేదంటే కాళ్ళు పట్టి గుంజడం కేసీఆర్ కుటుంబానికి వెన్నతో పెట్టిన విద్య… కుటుంబంలో పెద్దలకు చెప్పులు అందించడం భారతీయతను పాటించే మాకు అలవాటు. మా కుటుంబ పెద్ద,గురుతుల్యుడు కేంద్ర హోంమంత్రివర్యులకు వయస్సులో చిన్నవాడినైన నేను చెప్పులందించడం గులామ్ గిరియా ? మీరు సాష్టాంగ దండ ప్రణామం చేసినపుడు బెంగాల్ కూ… తమిళనాడుకూ గులామ్లు అయ్యారా ? ఇపుడు పాదరక్షలు అందిస్తే గుజరాత్ గులామ్ అయినట్టా? కేసీఆర్ లాగా అవసరాన్ని బట్టి పొర్లు దండాలు పెట్టడం మా రక్తంలో లేదు. ప్రొఫెసర్ జయశంకర్ సారును, కొండా లక్ష్మణ్ బాపూజీని ఘోరంగా అవమానించిన మీకు, గౌరవాల విలువ ఏమీ తెలుస్తుంది.

మమ్మల్ని ‘గులామ్’ లని వెక్కిరించే మీ కుసంస్కారం చూసి జనం నవ్వుకుంటున్నారు. అధికారం కోసం లోపటింట్లో రోజూ తన్నుకుంటున్న మీ కుటుంబసభ్యులకు,పెద్దలకు చెప్పులు అందించడంలోని సంస్కారం ఏం అర్థం అవుతది? రామ – భరతుల వారసత్వాన్ని మేం తలకెత్తుకున్నాం… తండ్రిని బంధించి,అన్నను చంపి అధికారం పొందిన ఔరంగజేబు వారసుల పక్కన తిరిగే మీకు,మా సంస్కృతి ఏం అర్థమవుతుంది ? మేం పాద రక్షలు మాత్రమే గౌరవంతో అందిస్తాం..! మీలా అవసరం తీరాక పాదాలుపట్టి లాగేసే అలవాటు మాకు లేదు. మేం ” గులామ్ “లం కాదు – మీలా మజ్లిస్ కు సలాం కొట్టే రజాకార్ల వారసులం అసలే కాదు. భారత్ మాతా కీ జై !’ అంటూ ట్విట్టర్‌ వేదికగా ధ్వజమెత్తారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version