పోలీసులు ఎంత బాధ్యతగా ఉన్నారో తెలుస్తోంది.. అర్వింద్‌ ఇంటిపై దాడిని ఖండించిన బండి సంజయ్‌

-

బీజేపీ ఎంపీ అర్వింద్‌ నివాసంపై టీఆర్ఎస్‌ శ్రేణులు దాడికి పాల్పడిన ఘటన హాట్‌టాపిక్‌గా మారింది. అయితే ఈ ఘటనపై మరోసారి తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌ మాట్లాడుతూ.. పోలీసులు కనుసన్నలోనే ఎంపీ అర్వింద్‌ నివాసంపై టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు దాడి చేశారని అరోపించారు. కేసీఆర్‌ కుటుంబానికి అహంకారం పెరిగిపోయిందని, అందుకే అకారణంగా దాడులు చేయిస్తోందని మండిపడ్డారు బండి సంజయ్‌. బంజారాహిల్స్‌లోని ఎంపీ అర్వింద్‌ నివాసానికి శనివారం వచ్చిన ఆయన.. దాడి జరిగిన తీరు గుర్తించి అడిగి తెలుసుకున్నారు. అర్వింద్‌ తల్లి విజయలక్ష్మితో మాట్లాడారు. అనంతరం సంజయ్‌ మాట్లాడుతూ.. అర్వింద్‌ ఇంటిపై టీఆర్‌ఎస్‌ దాడిని బీజేపీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు బండి సంజయ్‌. టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు అర్వింద్‌ ఇంటిపై దాడి చేసేందుకు ప్లాన్‌ చేసిన విషయం పోలీసులకు తెలిసినప్పటికీ పట్టించుకోలేదని, ఇంటి దగ్గర ఇద్దరు కానిస్టేబుళ్లను మాత్రమే నియమించారంటే ఎంత బాధ్యతగా ఉన్నారో అర్థమవుతోందన్నారు బండి సంజయ్‌.

ఇంట్లోని ఫర్నిచర్‌ను పగులకొట్టినందుకు అర్వింద్‌ తల్లి బాధపడడం లేదని నిత్యం పూజించుకునే దేవతామూర్తుల ఫొటోలను, తులసి కోటను కింద పడేయడం పట్ల మానసికంగా కుంగిపోతున్నారన్నారు బండి సంజయ్‌. దేవతామూర్తులను అవమానించారని మండిపడ్డారు. అసలైన హిందూ వాది అని చెప్పుకునే సీఎం కేసీఆర్‌ తన పార్టీ శ్రేణులు చేసిన పనికి ఎందుకు నోరు విప్పడం లేదని, ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు బండి సంజయ్‌. రాజకీయాల్లో దాడి సంస్కృతిని ఏ పార్టీ కూడా ప్రోత్సహించొద్దన్నారు. రాజకీయాలతో సంబంధం లేని కుటుంబసభ్యులపై దాడి చేయడం హేయమైన చర్య అని మండిపడ్డారు బండి సంజయ్‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version