అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నారా..? అయితే ఇలా సులభంగా బరువు తగ్గండి..!

-

ఉండాల్సిన దాని కంటే ఎక్కువ బరువు ఉండటం వల్ల కూడా ఆరోగ్యానికి ఇబ్బంది కలుగుతుంది. ఎన్నో అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఎప్పుడూ కూడా ఉండాల్సిన దాని కంటే ఎక్కువ బరువు ఉండకూడదు దీని వల్ల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. బిఎంఐ కి తగ్గట్టుగా బరువును మెయింటైన్ చేస్తే ఎలాంటి అనారోగ్య సమస్యలు మీ దరిచేరవు.

అయితే మీరు అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారా..? బరువు తగ్గాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా అవ్వడంలేదా అయితే ఏమి కోసం బరువు తగ్గడానికి కొన్ని చిట్కాలు. వీటిని కనుక అనుసరిస్తే ఖచ్చితంగా బరువు తగ్గొచ్చు. అయితే మరి ఎలా బరువు తగ్గచ్చు అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం.

మెంతులు:

మెంతులు బరువు తగ్గడానికి బాగా ఉపయోగపడతాయి. అలానే బెల్లీ ఫ్యాట్ ను కూడా కరిగిస్తాయి. కొవ్వు త్వరగా కరిగించేందుకు బాగా సహాయపడుతాయి. కాబట్టి మెంతులని తీసుకోండి.

పీనట్ బట్టర్:

ఇందులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది అలాగే ఫైబర్ కూడా ఉంటుంది. ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉండేలా చూసుకుంటుంది అలానే కొవ్వు కూడా కరిగిస్తుంది. అయితే డయాబెటిస్ తో బాధపడే వాళ్లు పీనట్ బటర్ తీసుకోకూడదు.

మిరియాలు:

మిరియాలు కూడా బెల్లీ ఫ్యాట్ ను కరిగించడానికి బాగా ఉపయోగపడతాయి. బరువు తగ్గడానికి ఇవి ఎంతగానో ఉపయోగ పడతాయి. కాబట్టి అధిక బరువుతో బాధపడే వాళ్లు మిరియాలను కూడా తీసుకోవచ్చు.

దాల్చిని:

దాల్చిని కూడా ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది. దీనిని తీసుకోవడం వల్ల త్వరగా బరువు తగ్గొచ్చు. బరువు తగ్గాలి అనుకునే వాళ్ళు నీళ్ళల్లో దాల్చిని వేసి మరిగించి… ఆ నీటిని వడకట్టి అందులో కొంచెం తేనె, నిమ్మరసం వేసుకుని పరకడుపున తీసుకుంటే త్వరగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. కాబట్టి ఈ విధంగా కూడా మీరు చేయవచ్చు.

పీస్:

ఇది కూడా బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. పచ్చిబఠాణి లో విటమిన్ సి, మెగ్నీషియం, పొటాషియం వంటివి ఉంటాయి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇలా బరువు తగ్గాలనుకునే వాళ్ళు ఈ విధంగా అనుసరిస్తే త్వరగా బరువు తగ్గడానికి అవుతుంది కాబట్టి ఈ ఇంటి చిట్కాలను అనుసరించి బరువు తగ్గండి. ఆరోగ్యంగా ఉండండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version