BRS అంటే బీర్,రమ్ము, స్కాచ్ – బండి సంజయ్

-

BRS అంటే బీర్,రమ్ము, స్కాచ్ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శలు చేశారు. మోడీ పర్యటన పూర్తిగా అధికారిక కార్యక్రమమని.. కెసిఆర్ బిడ్డ కూడా మాట్లాడిందని తెలిపారు. చదువుకున్న చదువు దేనికి.. వాళ్ళ చదువు డ్రగ్స్, కమిషన్, దొంగ సారా దందాకు ఉపయోగ పడ్డదని పేర్కొన్నారు.

చదువుకున్న అజ్ఞానులు మీరు.. Msc పొలిటికల్ సైన్స్ సర్టిఫికెట్ బయట పెట్టు మీ అయ్యదన్నారు. BRS అంటేనే అంతర్జాతీయ దొంగల ముఠా.. BRS అంటే బీర్,రమ్ము, స్కాచ్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వేల కోట్ల ఎలా సంపాదించావు…అయన పాలన లో అన్నీ లీకేజీ లే అంటూ నిప్పులు చెరిగారు. మోడీ నీ ప్రపంచం కొనియాడుతుందని.. పేర్కొన్నారు. విద్యా శాఖ మంత్రి రాజీనామ చేయాలని డిమాండ్‌ చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.

Read more RELATED
Recommended to you

Exit mobile version