BREAKING : నేడు బండి సంజయ్ నిరసన దీక్ష

-

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నేడు నిరసన దీక్ష చేపట్టనున్నారు. మహిళల హత్యలు, ఆత్మహత్యల ఘటనలకు నిరసనగా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఒక్కరోజు దీక్ష చేయనున్నారు. బండి సంజయ్ తో పాటు మహిళ మోర్చా నేతలు, పార్టీ సీనియర్ నాయకులు దీక్షలో పాల్గొననున్నారు.

మధ్యాహ్నం 12 గంటలకు దీక్ష ప్రారంభం కానున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. కాగా, ముఖ్యమంత్రి కేసీఆర్ కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్  నిన్న బహిరంగ లేఖ రాశారు. మీ పాలనలో ఉద్యోగ, ఉపాధ్యాయులుసహా ప్రజలంతా తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నారని..ఉద్యోగుల సమస్యలేవీ పరిష్కారం కావడం లేదని ఈ లేఖ ద్వారా పేర్కొన్నారు బండి సంజయ్. తక్షణమే వేతన సవరణ సంఘం (PRC)ను ఏర్పాటు చేసి జులై 1 నుండి ఉద్యోగులకు పెరిగిన జీతాలు చెల్లించాలని.. ఈనెల 9న జరగబోయే కేబినెట్ సమావేశంలో పీఆర్సీ ఏర్పాటుతోపాటు 3 నెలల్లో నివేదిక తెప్పించుకుని జులై 1 నుండి కొత్త పీఆర్సీ అమలయ్యేలా చర్యలు తీసుకోండని కోరారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version