టీఆర్ఎస్ ఎమ్మెల్యే కొనుగోలు కేసుపై నేడు తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టించి. అయితే.. ఈ కేసుపై విచారణ చేపట్టిన హైకోర్టు సీబీఐ విచారణను నిరాకరించి సిట్ దర్యాప్తు కొనసాగించాలని ఆదేశించింది. అయితే.. ఈ క్రమంలో హైకోర్టు ఆదేశాలపై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై హైకోర్టు సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలో సిట్ విచారణ జరపాలన్న హైకోర్టు నిర్ణయాన్ని స్వాగతించారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జారీ చేసిన ఉత్తర్వులపై సంతృప్తి వ్యక్తం చేశారు బండి సంజయ్. సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలో సిట్ విచారణ జరపాలన్నదే బీజేపీ అభిమతమని బండి చెప్పారు. హైకోర్టు ఉత్తర్వులతో విచారణ పారదర్శకంగా జరిగే అవకాశముందని అభిప్రాయపడ్డారు బండి సంజయ్.
బీజేపీ ప్రతిష్టను దెబ్బతీసేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని బండి సంజయ్ ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ బీజేపీపై ఆరోపణలు చేస్తూ ప్రెస్ మీట్ నిర్వహించడమే ఇందుకు నిదర్శనమని అన్నారు బండి సంజయ్. సీఎం ప్రెస్ మీట్ నిర్వహించడంపై హైకోర్టు ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు అభినందనీయమన్నారు బండి సంజయ్. తప్పు చేసినోళ్లకు, కుట్రదారులకు శిక్ష పడాల్సిందేనన్నారు బండి సంజయ్. తెలంగాణ ప్రజలు కూడా కోరుకునేది ఇదే అని చెప్పారు. హైకోర్టు ధర్మాసనంపట్ల తమకు నమ్మకం ఉందన్నారు. వాస్తవాలు వెలుగులోకి వస్తాయని ఆశిస్తున్నట్లు తెలిపారు బండి సంజయ్. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం వెనుక కుట్రదారులెవరన్నది తేలడంతో పాటు దోషులకు తగిన శిక్ష పడుతుందనే నమ్మకం ఉందని స్పష్టం చేశారు బండి సంజయ్.