కిషన్ రెడ్డిపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు !

-

కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి పై బండి సంజయ్ ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. తనను అరేయ్ అని పిలిచే చనువు కిషన్ రెడ్డికి మాత్రమే ఉందన్న బండి సంజయ్…  రారా సంజయ్… పోరా సంజయ్ అని కిషన్ రెడ్డి నన్ను పిలుస్తారని చాలా మందికి తెలియదని తెలిపారు. పదవుల కోసం కాకుండా .. బీజేపీ పార్టీ సిద్దాంతం కోసం కిషన్ రెడ్డి పనిచేశారని తెలిపారు.

పార్టీ కోసం కష్టం చేయడంలో కిషన్ రెడ్డి నాకు ఆదర్శమన్నారు. ఎన్నో కష్టాలను ఎదుర్కొని కిషన్ రెడ్డి క్యాబినెట్ స్థాయికి ఎదగటం చాలా సంతోషమన్ని బండి సంజయ్‌… యువ మోర్చాలో కిషన్ రెడ్డికి నేను చాలా దగ్గర కార్యకర్తగా పని చేశానని వివరించారు. దేశాన్ని సర్వనాశనం చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని… సభ జరగకుండా పార్లమెంట్ ను కాంగ్రెస్ పార్టీ అడ్డుకోవటం‌ సిగ్గుచేటని ఫైర్‌ అయ్యారు. సంప్రదాయాలను తుంగలో తొక్కటం కాంగ్రెస్ కు అలవాటుగా మారిందని విరుచుకు పడ్డారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version