ప్రగతి భవన్ ను కూల్చేస్తాం..కేసీఆర్ ఫామ్ హస్ ను దున్నేస్తాం : బండి సంజయ్

-

బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి సీఎం కేసీఆర్‌ పై నిప్పులు చెరిగారు. ప్రగతి భవన్ ను కూల్చి 125అడుగుల అంబేడ్కర్‌ విగ్రహం ఏర్పాటు చేస్తామని..2023 తర్వాత లక్ష నాగళ్ళతో కేసీఆర్ ఫామ్ హస్ ను దున్ని బడుగులకు పంచుతామని పేర్కొన్నారు.

కేసీఆర్ మెడలు వంచి బడుగులకు ఇచ్చిన హామీలను అమలు చేయిస్తామని… హుజురాబాద్ లో బైపోల్స్ కాదు.. కేసీఆర్ కు బైయింగ్ ఎలక్షన్స్ అని చురకలు అంటించారు. పది కాదు.. ప్రతి దళిత కుటుంబానికి ప్రభుత్వం 50లక్షలు ఇవ్వాలని… హుజురాబాద్ లో బీజేపీ గెలుపును సీఎం కేసీఆర్ అడ్డుకోలేడని పేర్కొన్నారు.

కేసీఆర్ పై తెలంగాణ సమాజం విశ్వాసం కోల్పోయిందని.. ఎస్సీ, ఎస్టీ, బీసీల అభివృద్ధిపై కేసీఆర్ కు చితశుద్ది లేదని మండిపడ్డారు. పోడు భూముల్లో చేతికొచ్చిన పంటను నాశనం చేసిన మూర్ఖుడు కేసీఆర్ అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఫారెస్ట్ అధికారులను పంపి పోడు రైతులకు అన్యాయం చేస్తున్నాడని.. కుల వృత్తులను నాశనం చేసిందే ముఖ్యమంత్రి కేసీఆర్ అని మండిపడ్డారు. దమ్ముంటే ఈటల బావమరిది చాటింగ్ పై విచారణ జరిపించాలని.. బడుగులు, నిరుద్యోగుల సమస్యలపై పోరాటాలకు బీజేపీ సిద్ధమవుతోందన్నారు బండి సంజయ్.

Read more RELATED
Recommended to you

Exit mobile version