ఒలంపిక్స్‌లో కండోమ్‌ను అలా వాడేసి పతకం గెలిచిన అథ్లెట్‌…!

-

టోక్యో ఒలంపిక్స్ లో జ‌రిగిన ఈ ఏడు రోజుల్లో కొన్ని చమత్కారమైన వీడియోలతో పాటు ఫోటోలతో విప‌రీతంగా వైర‌ల్ అవుతున్నాయి. వాస్త‌వానికి ఇప్ప‌టి దాకా ఆడిన ఆటల్లో తెలివితేటలు, భావోద్వేగం, కోపం అలాగే గందరగోళం లాంటి క్షణాలు అనేకం చోటు చోటుచేసుకున్నాయి. ఇక సోషల్ మీడియాలో దూసుకుపోత‌యిన కొన్ని ఘ‌ట‌న‌లు కూడా ఉన్నాయి. ఒలింపిక్స్ నుంచి తాజాగా ఆస్ట్రేలియా అథ్లెట్ జెస్సికా ఫాక్స్ చేసిన ప‌ని ఇప్పుడు వైర‌ల్ అవుతోంది.

27 ఏళ్ల ఈ అథ్లెట్ తన ప్రత్యర్థులను ఓడించి 6వ రోజు జరిగిన మొట్టమొదటి మహిళల సి1 ఒలింపిక్ ఫైనల్ లో ఏకంగా స్వర్ణం సాధించింది. అయితే ఆమె ఫైనల్ కు ముందు, ఆమె త‌న ఫాక్స్ కి కొంచెం ఫిక్సింగ్ చేయాల్సి వచ్చింది. దీంతో ఆమె దానికి మరమ్మతు కోసం ప్లాస్టర్ చేయడానికి ఏకంగా కండోమ్ లను ఉపయోగించినట్లు తెలిపింది.

ఇక ఆమె కండోమ్‌తో ఎలా రిపేర్ చేసిందో ఓ టిక్ టాక్ వీడియో కూడా తీసి స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఇక ఈ టిక్ టాక్ వీడియోలో ఒక వ్యక్తి ఫాక్స్ యొక్క దెబ్బతిన్న కయాక్ వ‌ద్ద ఒక రకమైన నల్ల పుట్టీని మౌల్డింగ్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. తరువాత అతను కండోమ్ ను బయటకు తీసి, పుట్టీని సురక్షితంగా ఉంచడానికి ముక్కు పై సాగదీయ‌డం క‌నిపిస్తోంది. మొత్తానికి కండోమ్‌ను ఇలా వాడేసింద‌న్న‌మాట‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version