కొండగట్టులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఈరోజు అనుచిత వ్యాఖ్యలు చేశారు. తెలంగాణా సీఎం కేసీఆర్ ఏర్పాటు చేస్తున్న అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల గురించి ఆయన మాట్లాడుతూ ఇవన్నీ ముస్లింల బుజ్జగింపు కోసమేనని అన్నారు. భాగ్యనగరంలో పేద బీసీలకు అన్యాయం చేసి క్రికెట్ టీంలను కన్నవారికి బీసీ రిజర్వేషన్లు అందించడానికే ఈ ప్రత్యేక సమావేశాలని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం ముస్లిం మహిళల రక్షణ కోసం త్రిబుల్ తలక్ పై చట్టం చేస్తే మాట్లాడని సీఎం కేసీఆర్, ఇప్పుడు మాత్రం వాళ్ళ ఓట్ల కోసం, వాళ్ళను ఎక్కువ మందిని బీసీ కేటగిరీలో జీహెచ్ ఎంసీలో పోటీ చేయించడానికి ప్రత్యేక చట్టం చేయాలి కాబట్టి ఈ అత్యవసర అసెంబ్లీ సమావేశాలు జరపడం సిగ్గుచేటని ఆయన అన్నారు.
రాష్ట్రంలో విలయతాండవం చేస్తున్న సమస్యలు సీఎం కేసీఆర్ కు పట్టవు కానీ.. ఓట్లు సీట్లు మాత్రం కావాలని ఆయన అన్నారు. క్రికెట్ టీం ల కన్నవారికి సీఎం కేసీఆర్ అందలం ఎక్కించాలని చూస్తూన్నారన్న ఆయన కరీంనగర్ లో హిందువులు బొందుగాళ్ళు అంటే హిందువులు అంత ఒకటై ఎలా బుద్ది చెప్పారో, హైదరాబాద్ లో కూడా అలాగే హిందువులు అంత ఏకమై నీకు గుణపాఠం చెపుతారని ఆయన అన్నారు. గతంలో బీసీలకు చెందాల్సిన 22 కార్పొరేటర్ సీట్లను మైనారిటీలకు ఇచ్చాడని, ఇప్పుడు వాటిని రెండింతలు చేయడానికి ఈ అసెంబ్లీ సమావేశాలు పెట్టారని ఆయన అన్నారు. ఆయన కుటిల రాజకీయ బుద్దిని, ఓటు బ్యాంకు రాజకీయాన్ని ప్రజల ముందు ఎండగడతామని సంజయ్ పేర్కొన్నారు.