మిస్సయిన ఇంటర్ విద్యార్థిని కోసం 30 బైక్ లతో గాలిస్తున్న యువకులు

-

హైదరాబాద్ లో అర్ధరాత్రి ఛాటింగ్ చేస్తున్నావని తిట్టినందుకు వెళ్ళిపోయిన ఇంటర్ విద్యార్థిని లారా అదృశ్యం కేసు ఇంకా వీడలేదు. ఛాటింగ్ చేస్తుంటే తిట్టారని పేరెంట్స్ మందలించారని మూడు రోజుల క్రితం తట్టి అన్నారంలోని ఇంటి నుండి లారా వెళ్లి పోయింది. అయితే తన సెల్ ఫోన్ ను ఇంట్లోనే వదిలి వెళ్ళడంతో ఆమె సెల్ ఫోన్ లేకపోవడం తో పోలీస్ లకు దర్యాప్తు కష్టం గా మారింది. లారా గత కొద్ది రోజులుగా ఎవరెవరితో మాట్లాడింది అని ..సెల్ ఫోన్ డేటాని పోలీస్ లు విశ్లేషిస్తున్నారు.

ఆమె పుట్టిన నాటి నుండి అంటే 16 సంవత్సరాల్లో …ఒక్క రోజు కూడా ఇల్లు వదిలి వెళ్ళలేదని ఇప్పుడు బయటకు వెళ్లి 3 రోజులు అయింది..ఎక్కడుందో ? ఎలా వుందో ? అని ఆమె పేరెంట్స్ బాధ పడుతున్నారు. పోలీసులు సీసీ కెమెరాల్లో వెదికినా ఎక్కడా లారా కనిపించకపోవడం మా దురదృష్టమని వారు అంటున్నారు. మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నామన్న వారు ఎక్కడున్నా ఇంటికి వచ్చేయి అని కోరారు. ఒక వేళ ఆమెకు ఎవరైనా సహాయం చేస్తున్నా..వారిని కూడా కోరుతున్నాము..దయచేసి లారా సమాచారం ఇవ్వండని కోరారు. ఇక ఆ కుటుంబానికి చెందిన వారు, వారి స్నేహితులు దాదాపు 30 బైక్ లతో లారా కోసం గాలిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version