జనగామలో బీజేపీ కార్యకర్తల మీద జరిగిన లాఠీఛార్జ్ మీద బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఫైర్ అయ్యారు. విచక్షణ రహితంగా బీజేపీ కార్యకర్తల లాఠీఛార్జ్ చేసిన సీ.ఐపై 24 గంటల్లోగా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేకపోతే ఏ రూపంలోనైనా డిజిపి కార్యాలయాన్ని ముట్టడిస్తాం.. దమ్ముంటే అడ్డుకో అంటూ సవాల్ చేశారు. రేపు చలో జనగామకు బండి సంజయ్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో పోలీసులకు బీజేపీ వ్యతిరేకం కాదన్న ఆయన బీజేపీ కార్యకర్తల రక్తాన్ని చెవిచూస్తున్న కొంతమంది పోలీసు అధికారులకు తగిన బుద్ధి చెపుతాం..వారిని ఒదిలే ప్రసక్తే లేదని అన్నారు.
రాష్ట్రంలో గడిలా పాలన అంతం అవుతుండన్న ఆయన రాష్ట్రంలో సీఎస్, డిజిపిలకే సీఎం కేసీఆర్ తో మాట్లాడే స్వేచ్ఛ లేదని సీఎం కేసీఆర్ కొడుకును తీసుకొని వచ్చి విపు చింతపండు చేస్తే ఆ బాధ తెలుస్తుందని అన్నారు. స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలను జరుపోకొనివ్వకపోవడం దారుణమన్న ఆయన అంబేద్కర్ జయంతి, వర్ధంతి కి రాని సీఎం కేసీఆర్ కు మహనీయుల విలువ ఎలా తెలుస్తుంది ? అని ప్రశ్నించారు.