పాతబస్తీని 15 నిమిషాల్లో జల్లెడ పట్టిస్తాం..హిందూ ధర్మం కోసం ఆ పనిచేస్తా : బండి సంజయ్

-

తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. సంచలన వ్యాఖ్యలు చేశారు. 15 నిమిషాలు టైమిస్తే హిందువులను నరికి చంపుతామని ఎంఐఎం నాయకులన్నారని ఫైర్ అయ్యారు. నేను చెబుతున్నా ఒవైసీ, కేసీఆర్! తెలంగాణలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత 15 నిమిషాలు విద్యుత్ సిబ్బందికి పాతబస్తీని అప్ప జెప్పుతామని హెచ్చరించారు.

పాతబస్తీ గల్లీగల్లీలను జల్లెడ పట్టి విద్యుత్ బకాయిలను వడ్డీ తో సహా వసూలు చేస్తామని స్పష్టం చేశారు. త్వరలో “పాతబస్తీ ఫైల్స్”, “అవినీతి ఫైల్స్” బయటకు వస్తాయని హెచ్చరించారు. తెలంగాణ లో కేసీఆర్ రజాకార్ల పాలన నడిపిస్తున్నారని.. భోధన్ లో బిజెపి కార్యకర్తలు , హిందువులపై కేసులు పెడుతున్నారని నిప్పులు చెరిగారు.

కేసీఆర్ ఎంతమంది స్ట్రాటజిస్ట్ లను తెచ్చుకున్నా బిజెపిని ఏం చెయ్యలేరని.. అవినీతి యూపీఎ పాలనలో కేంద్ర మంత్రిగా కేసీఆర్ భాగస్వామి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాకిస్తాన్ ప్రధాని భారత ప్రభుత్వాన్ని, విదేశాంగ విధానాన్ని ప్రశంసిస్తుంటే … కేసీఆర్ మాత్రం విమర్శలు చేస్తున్నారని.. ఇమ్రాన్ కు ఉన్న బుద్ధి, కేసీఆర్ కు లేదని ఆగ్రహించారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version