ఏప్రిల్‌ 14 నుంచి బండి సంజయ్ రెండో విడత పాదయాత్ర..పాల్గొననున్న అమిత్ షా

-

ఏప్రిల్ 14 న జోగులాంబ శక్తి పీఠం నుండి బండి సంజయ్ రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభం కానుందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రదీప్ కుమార్ పేర్కొన్నారు. 31 రోజుల పాటు యాత్ర , మే 14 న మహేశ్వరం లో ముగుస్తుందని.. ఉమ్మడి మహబూబ్ నగర్ లో 9 నియోజకవర్గాలు, మహేశ్వరం నియోజకవర్గం లో ఉంటుందని చెప్పారు. ముగింపు సభకు అమిత్ షా హాజరు అవుతారని.. పాదయాత్ర అసెంబ్లి ఇంచార్జ్ లుగా బీజేపీ మాజీ ఎంపీలు, మాజీ మంత్రులు కూడా ఉంటారన్నారు.

ప్రజా వ్యతిరేక విధానాలను, అంబెడ్కర్ రాజ్యాంగాన్ని అమలు చేయని ప్రభుత్వం వైఖరిని ఈ యాత్ర ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్పారు. మొదటి విడత ప్రజా సంగ్రామ యాత్ర తో రాష్ట్ర రాజకీయాల్లో మార్పులు వచ్చాయని.. సీఎం లో అసహనం పెరిగిందన్నారు. ప్రజలు ఈ సర్కార్ ని గద్దె దించేందుకు సిద్ధం అయ్యారని.. రాజ్యాంగాన్ని అవమాన పరిచిన సీఎం కి బుద్ధి చెప్పాలని అంబెడ్కర్ జయంతి రోజున యాత్ర ప్రారంభిస్తున్నామని హెచ్చరించారు.

స్థానిక ప్రజల భాగస్వామ్యం చేస్తూ… బూత్ స్థాయి నుండి పాల్గొనేలా ప్రత్యేక దృష్టి ఉంటుందని… యాత్ర ప్రారంభానికి అస్సాం సీఎం లేక కర్ణాటక సీఎం హాజరు అవుతారన్నారు. ప్రజల తో రచ్చబండ లాంటి కార్యక్రమాలు ఉంటాయి.. సభల కన్నా ఎక్కువ ప్రజలతో ఉండే కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు. 387 కిలో మీటర్లు యాత్ర సాగుతుంది… 10 అసెంబ్లీ, 3 పార్లమెంట్ ల పరిధిలో యాత్ర కొనసాగుతుందని… యాత్ర లో పాల్గొనాలనుకునే వారు మొబైల్ 6359119119 కి మిస్ కాల్ ఇవ్వొచ్చన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version