తెలంగాణ ప్రభుత్వం రాజ్ భవన్, గవర్నర్ వ్యవస్థను కావాలనే అవమానిస్తున్నారని టీఆర్ఎస్ ప్రభుత్వంపై మరోసారి గవర్నర్ తమిళి సై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎందుకు అవమానిస్తున్నారో వారికే తెలియాలని వ్యాఖ్యానించారు. ఈ రోజు ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో కలిసిన తరువాత ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో పరిస్థితుల గురించి మంత్రికి తెలియజేశానని అన్నారు. నేను ఎప్పుడూ తెలంగాణ ప్రజల కోసమే ఆలోచిస్తున్నానని అన్నారు. ఈనెల 10వ తేదీని భద్రాచలం శ్రీరామ దేవస్థానానికి వెళ్తున్నట్లు వెల్లడించారు.
గవర్నర్ వ్యవస్థను అవమానిస్తున్నారు…. మహిళా గవర్నర్ కు కనీస గౌరవం ఇవ్వడం లేదు: తమిళి సై
-