బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు.. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా !

-

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కూడా మాతో టచ్‌లో ఉన్నారంటూ పేర్కొన్నారు బండి సంజయ్‌. మునుగోడు లో 100% బిజెపి గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి పలుమార్లు బిజెపికి అనుకూలంగా వ్యాఖ్యలు చేశారని తెలిపారు.

అధికార పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు బిజెపిలోకి టచ్ లోకి వచ్చారని సంచలన వ్యాఖ్యలు చేశారు బండి సంజయ్‌. తెలంగాణలో మరికొన్ని చోట్ల ఉప ఎన్నికలకు వచ్చే అవకాశం ఉందని తెలిపారు.

క్యాసినో డ్రగ్స్ కేసులో ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులకు సంబంధం ఉందని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. మంత్రుల తమ అక్రమ ఆస్తులను కాపాడుకోవడానికి మాత్రమే జోకర్లలా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చేకోటి ప్రవీణ్ వెనుక ఉన్నది.. కెసిఆర్ కుటుంబ సభ్యులేనని సంచలన ఆరోపణలు చేశారు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version