చిరంజీవి ఇండ‌స్ట్రీ పెద్ద వ్యాఖ్య‌ల‌పై బండ్ల గ‌ణేష్ స్పంద‌న

-

సినిమా ఇండస్ట్రీలో పెద్దన్న పాత్ర పోషించ‌న‌ని మెగా స్టార్ చిరంజీవి ఈ రోజు చేసిన వ్యాఖ్య‌లు వైర‌ల్ అవుతున్నాయి. ఈ వ్యాఖ్య‌లపై ప‌లువురు స్పందిస్తున్నారు. తాజా గా న‌టుడు, నిర్మాత బండ్ల గ‌ణేష్ ట్వీట్ట‌ర్ లో స్పందించాడు. సూప‌ర్ స‌ర్.. బాగా చెప్పారు అంటూ అని నిర్మాత బండ్ల గ‌ణేష్ ట్వీట్ చేశారు. కాగ ఇటీవ‌ల సినీ ప‌రిశ్ర‌మ వివాదం జ‌రుగుతుంది. అయితే దీని పై ఈ రోజు మెగా స్టార్ చిరంజీవి కీలక వ్యాఖ్య‌లు చేశారు. తాను ఇండ‌స్ట్రీ పెద్ద‌గా ఉండాల‌ని ఎప్పుడూ అనుకోలేద‌ని అన్నారు. ఇండస్ట్రీ పెద్ద ప‌ద‌విలో ఉంటే.. అన‌వ‌స‌రం అయిన పంచాయితీలు వ‌స్తాయ‌ని వాటి గురించి ఆలోచించలేన‌ని అన్నారు.

ఇండ‌స్ట్రీ పెద్ద అని పిలిపించుకోవ‌డం ఇష్టం లేద‌ని తెలిపారు. అన‌వ‌స‌ర విష‌యాల్లో తాను త‌ల దూర్చ‌న‌ని స్ప‌ష్టం చేశారు. కానీ అవ‌స‌రం అయ్యే విష‌యాల‌లో ఇండ‌స్ట్రీకి అండ‌గా ఉంటాన‌ని అన్నారు. అలాగే సినీ కార్మికుల‌కు ఎలాంటి ఇబ్బంది ఉన్నా.. సాయం చేయ‌డానికి సిద్ధంగా ఉంటాన‌ని తెలిపారు. కాగ వ్యాఖ్య‌లపై చాలా మంది స్పందిస్తున్నారు. నిర్మాత బండ్ల గ‌ణేష్ కూడా ఈ వ్యాఖ్య‌ల‌పైనే చిరంజీవి మ‌ద్దత్తుగా ట్వీట్ చేశాడు.

Read more RELATED
Recommended to you

Latest news