మోహన్ బాబుతో గొడవపై క్లారిటీ ఇచ్చిన బెనర్జీ.. అసలు విషయం ఏమిటంటే..?

-

ప్రముఖ నటుడు బెనర్జీ గత ఎడాది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో జరిగిన రచ్చ గురించి మరొకసారి మాట్లాడడం జరిగింది.. పూర్తి వివరాల్లోకెళ్తే ప్రముఖ టీవీ ఛానల్ లో ప్రతివారం ప్రసారమయ్యే ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమానికి గెస్ట్ గా వచ్చిన బెనర్జీ తన గురించి ఎవరికీ తెలియని ఎన్నో విషయాలను వెల్లడించారు. ఇకపోతే తాను ఇండస్ట్రీలోకి డైరెక్టర్ అవుదామనుకొని వచ్చానని కానీ అమితాబ్ బచ్చన్ సినిమాకు పనిచేస్తున్న సమయంలో ఒక కన్నడ నటుడు రాకపోవడంతో తాను ఆ సన్నివేశంలో చేశానని అలా దర్శకుడిని కాస్త నటుడిగా మారిపోయానని తెలిపారు బెనర్జీ.. దర్శకుడు అవ్వాలనే కోరిక ఇంకా చావలేదు అనే తన మనసులో మాటను వెల్లడించాడు.

ఇక కార్యక్రమంలో భాగంగానే మోహన్ బాబు మీ పై చేయి చేసుకున్నారంట కదా? అని ప్రశ్నించగా .. కంటతడి పెట్టుకున్న బెనర్జీ ఈ విషయాన్ని కళ్ళు తుడుచుకుంటూ వెల్లడించారు.. బెనర్జీ మాట్లాడుతూ.. మోహన్ బాబు విజ్ఞతకే ఆ విషయాన్ని వదిలేసాను. ఇక మా ఎన్నికల సమయంలో ఏం జరిగిందంటే.. ప్రకాష్ రాజు ప్యానెల్ లోని తనీష్ ని మోహన్ బాబు తిట్టారు. ఇక ఆ సమయంలో అక్కడికి వెళ్లి గొడవలొద్దని విష్ణుతో నేను చెప్పాను. వెంటనే మోహన్ బాబు నన్ను కొట్టడానికి వచ్చారు .. అరగంట పాటు బూతులు తిట్టారు . 40 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న నన్ను అలా తిట్టేసరికి షాక్ లో ఉండిపోయాను అంటూ ఆయన కన్నీరు మున్నీరయ్యారు.

కానీ మోహన్ బాబు ఇలా చేయడం ఏమాత్రం సరికాదు అని నెటిజన్లు సైతం కామెంట్లు చేస్తున్నారు. ఇక ఆయనకు కోపం ఉండడం సహజమే.. కానీ తోటి నటుడిని మాటలతో హింసించడం ఏమాత్రం కరెక్ట్ కాదు అంటూ కొంతమంది నెటిజన్ లు మోహన్ బాబు పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version