తెలంగాణ పోలీసులపై NTR సంచలన వ్యాఖ్యలు..ప్రెషర్‌ పెడుతున్నారు ?

-

నిన్న రామోజీ ఫిల్మ్‌ సిటీ జరుగాల్సిన బ్రహ్మాస్త్రం మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ రద్దైన సంగతి తెలిసిందే. తెలంగాణ పోలీసులు.. అనుమతులు ఇవ్వకపోవడంతో.. ఈ ఈవెంట్‌ రద్దు అయింది. దీంతో పార్క్ హయత్ హోటల్ లో బ్రహ్మాస్త్రం మూవీ ప్రెస్‌ మీట్‌ నిర్వహించింది. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ అభిమానులకు క్షమాపణలు చెప్పారు.

ఎంతో ఆర్భాటంగా చేద్దాము అనుకున్న ఈవెంట్ కు పోలీస్ లు గణేష్ బందోబస్తు మధ్య పర్మిషన్ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బాధ్యతాయుతమైన పౌరుడిగా ఈవెంట్ కు వస్తాము అనుకున్న..కానీ అందరికీ సారీ అంటూ పేర్కొన్నారు.

బ్రహ్మాస్త్రం పెద్ద సక్సెస్ అవ్వాలి అని కోరుకుంటున్నాను… డైరెక్టర్ అయాన్ ముఖర్జీకి అల్ ది బెస్ట్ చెప్పారు. 75 సంవత్సరాల స్వతంత్ర దినోత్సవం చేసుకున్నామని… ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ ఒక ప్రెషర్ కు గురవుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆడియన్స్ కు గుడ్ అండ్ గ్రేట్ మూవీస్ ను ఇవ్వాలని… రాజమౌళి, కరణ్ జోహార్ కలిసి ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ ని ఒకటిగా చేశారని తెలిపారు ఎన్టీఆర్.

Read more RELATED
Recommended to you

Exit mobile version